Gachibowli: పార్టీలకతీతంగా డీఎ్‌సకు గుర్తింపు..
ABN , Publish Date - Jul 08 , 2024 | 03:37 AM
తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత ధర్మపురి శ్రీనివా్‌స(డీఎస్) అని పలువురు ప్రముఖులు కొనియాడారు.
శ్రద్ధాంజలి సభలో పలువురి నివాళి
హైదరాబాద్ సిటీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత ధర్మపురి శ్రీనివా్‌స(డీఎస్) అని పలువురు ప్రముఖులు కొనియాడారు. బీజేపీ ఎంపీ, డీఎస్ కుమారుడు ధర్మపురి అర్వింద్, కుటుంబ సభ్యులు గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం డీఎస్ శ్రద్ధాంజలి సభను నిర్వహించారు. ఇందులో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ.. రాజకీయాల్లో అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్న నేత డీఎస్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి పార్టీలకు అతీతంగా హాజరైన నేతలు డీఎస్ చిత్రపటానికి పూలమాళలు వేసి నివాళులు అర్పించారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందర్‌రావు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ, వీహెచ్ మధుయాష్కీ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తదితరులు డీఎ్‌సకు నివాళులర్పించారు. డీఎస్ ప్రస్థానంపై రూపొందించిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది.