Share News

Duddilla Sridhar Babu: రాష్ట్రంలో నూతన ఎంఎ్‌సఎంఈ పాలసీ..

ABN , Publish Date - Jun 25 , 2024 | 04:01 AM

రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల (మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటైర్‌ప్రైజె్‌స-ఎంఎ్‌సఎంఈ పాలసీ)కు సంబంధించి కొత్త విధానాన్ని రూపొందిస్తోందని, అందులో మహిళా పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రాధాన్యమిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Duddilla Sridhar Babu: రాష్ట్రంలో నూతన ఎంఎ్‌సఎంఈ పాలసీ..

  • మహిళలకు అధిక ప్రాధాన్యం: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల (మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటైర్‌ప్రైజె్‌స-ఎంఎ్‌సఎంఈ పాలసీ)కు సంబంధించి కొత్త విధానాన్ని రూపొందిస్తోందని, అందులో మహిళా పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రాధాన్యమిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. దీనికి సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. దేశంలోనే ఎంఎ్‌సఎంఈల కోసం ప్రత్యేకంగా పాలసీను తీసుకొస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో ఫిక్కీ లేడిస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌వో) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు- సమ్మిళిత అభివృద్ధి’’ అనే అంశమ్మీద నిర్వహించిన సదస్సులో శ్రీధర్‌బాబు పాల్గొని మాట్లాడారు.


ఈ సందర్భంగా వ్యాపారాల్లో మహిళలకు తోడ్పాటును అందిస్తామని, వాళ్లు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందన్నారు. రాష్ట్రంలోని యువత నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు త్వరలో స్కిల్‌ యూనివర్శిటీని తీసుకురాబోతున్నామని చెప్పారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డుతోపాటు దాని చుట్టూ రింగ్‌ రైల్వే లైన్‌ను ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఐటీ కంపెనీలకు, ఆర్‌ఆర్‌ఆర్‌ పరిధిలో పరిశ్రమలకు అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు.


85వేల ఎకరాల్లో బిందు సేద్యం

ప్రస్తుత సంవత్సరానికిగాను 85,313 ఎకరాల్లో బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనలో భాగంగా ‘ప్రతి చుక్కకు... ఎక్కువ పంట’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకానికి అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ నీటిపారుదల పథకాన్ని అమలు చేస్తోంది. మొదటి విడతలో 32 జిల్లాల్లో 50 వేల ఎకరాలకు డ్రిప్‌ యూనిట్లు మంజూరు చేస్తూ సోమవారం ఉద్యానశాఖ డైరెక్టరేట్‌ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇతర పంటల్లో 26,563 యూనిట్లకు డ్రిప్‌, 8,750యూనిట్లకు స్ర్పింక్లర్లు కలిపి... 35,313యూనిట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jun 25 , 2024 | 04:01 AM