Share News

Sankranti: ప్రయాణంలో ప్రమాదానికి ఛాన్స్ ఇవ్వకండి.. ఈ జాగ్రత్తలు ఫాలో అయిపోండి..

ABN , Publish Date - Jan 13 , 2024 | 10:10 AM

తెలుగు వారి ముఖ్యపండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారితో రెండు రాష్ట్రాల్లోని రహదారులు రద్దీగా మారింది.

Sankranti: ప్రయాణంలో ప్రమాదానికి ఛాన్స్ ఇవ్వకండి.. ఈ జాగ్రత్తలు ఫాలో అయిపోండి..

తెలుగు వారి ముఖ్యపండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారితో రెండు రాష్ట్రాల్లోని రహదారులు రద్దీగా మారాయి.. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరాలలో నివసించే ఏపీ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైవేలపై వాహనాల సంఖ్య పెరిగి భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. టోల్ గేట్ దాటేందుకు వాహనాలకు అధిక సమయం పడుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై.. టోల్‌బూత్‌ల మధ్య ట్రాఫిక్‌ క్లియర్‌ చేయటం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పంతంగి, కొర్లపహాడ్, మాడ్గులపల్లి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు టోల్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ప్రయాణీకుల రద్దీతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్ లు కిటకిటలాడుతున్నాయి. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేశారు.

సంక్రాంతి సందర్భంగా జాతీయ రహదారి 65 పై ఎలాంటి రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా ముందస్తుగా పోలీసులు నివారణ చర్యలు చేపట్టారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అతివేగంతో వాహనాలు నడపకూడదని, నిద్ర మత్తులో వాహనాలు నడపవద్దని సూచించారు. దూర ప్రయాణం వల్ల అలసిపోవడం, నిద్ర మత్తు కారణంగా ప్రమాదాలకు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం చలి ప్రభావం, పొగమంచు అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర సమయంలో రహదారుల అధికారులను లేదా డయల్ 100 కు ఫోన్ చేయాలన్నారు.


జాతీయ రహదారి పరిధిలోని గ్రామాల రైతులు, ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. రాంగ్ రూట్ లో వాహనాలు, పశువులను తీసుకువెళ్లడం ప్రమాదం అని గమనించాలని సూచించారు. పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలన్నారు. రోడ్లపై న్యూసెన్స్ చేసినా, ఎక్కడపడితే అక్కడ వాహనాలు ఆపితే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

Updated Date - Jan 13 , 2024 | 10:18 AM