Share News

KTR: ఫార్మా కంపెనీల కోసం భూములివ్వాలని బెదిరిస్తున్నారు

ABN , Publish Date - Aug 10 , 2024 | 04:02 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దౌల్తాబాద్‌ మండల రైతులు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వద్ద గోడు వెల్లబోసుకున్నారు.

KTR: ఫార్మా కంపెనీల కోసం భూములివ్వాలని బెదిరిస్తున్నారు

  • కేటీఆర్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేసిన రైతులు

హైదరాబాద్‌, వికారాబాద్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దౌల్తాబాద్‌ మండల రైతులు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వద్ద గోడు వెల్లబోసుకున్నారు. శుక్రవారం కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి వచ్చిన రైతులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి... తమకు అండగా నిలవాలని కోరారు.


దుద్యాల్‌ మండలంలోని హకీంపేట్‌, పోలెపల్లి, లకచర్ల గ్రామాల్లో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు కేటీఆర్‌కు వివరించారు. ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని తమకు ఈ ఫ్యాకర్టీలు వద్దని రైతులు చెబుతున్నప్పటికీ సీఎం అన్న తిరుపతిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున అండగా ఉంటామని కేటీఆర్‌ వారికి భరోసా ఇచ్చారు.

Updated Date - Aug 10 , 2024 | 04:02 AM