Share News

Kishan Reddy: కాంగ్రెస్, ఎంఐఎంవి కుమ్మక్కు రాజకీయలు

ABN , Publish Date - Apr 11 , 2024 | 06:00 PM

కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Kishan Reddy: కాంగ్రెస్, ఎంఐఎంవి కుమ్మక్కు రాజకీయలు
G Kishan Reddy

హైదరాబాద్, ఏప్రిల్ 11: కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంలు కుమక్కు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి (G Kishan Reddy) ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకు వస్తానన్నా మార్పు ఏమైందని ప్రశ్నించారు.

Vasantha..Yarlagadda:విజయవాడకు అటు ఇటు.. ఇద్దరిది ఒకటే దారి

ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు.. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో మార్పు వచ్చిందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఎంఐఎం రాజకీయాలు చేస్తుందంటూ మండిపడ్డారు. తెలంగాణలో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని రగిలిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంలు హైదరాబాద్ అభివృద్ధిని గాలికొదిలేశాయని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలు కొత్త నాటకానికి తెర తీశాయన్నారు. ఓట్లు కోసం కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఎంతకైనా దిగజారతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Revanth: ధాన్యం కొనుగోళ్లల్లో నిర్లక్ష్యం వహించొద్దు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు


ఎన్నికల వేళ.. తెలంగాణలో వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు వెల్లువెత్తాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే తెలంగాణ బీజేపీ భారీగా లోక్‌సభ స్థానాలు గెలుచుకొంటుందని ఇప్పటికే ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

TG Politics: ఆ సంస్థతో సీఎం రేవంత్ వేలకోట్ల సెటిల్మెంట్లు.. బీజేపీ నేత మహేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు

అదీకాక ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఇదే ఎన్నికల్లో తమ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అలాంటి వేళ తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు ఓటు వేసి అత్యధిక స్థానాలు కట్టబెడతారనే అంశం చిక్కపట్టకుండా ఉందనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో సాగుతోంది.

తెలంగాణ వార్తలు కోసం..

Updated Date - Apr 11 , 2024 | 07:21 PM