Share News

Karimnagar: గంగుల కమలాకర్‌ కాంగ్రెస్‌లోకి?

ABN , Publish Date - Jun 23 , 2024 | 03:11 AM

మాజీ మంత్రి, కరీంనగర్‌ శాసనసభ్యుడు గంగుల కమలాకర్‌ బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కొద్దిరోజులుగా ఆయన బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగినా కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు సర్వం సిద్ధమైందని శనివారం వార్తలు వచ్చాయి.

Karimnagar: గంగుల కమలాకర్‌ కాంగ్రెస్‌లోకి?

  • పార్టీ మార్పుపై ప్రచారం బీఆర్‌ఎస్‌ను వీడేది లేదంటున్న మాజీమంత్రి

కరీంనగర్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ మంత్రి, కరీంనగర్‌ శాసనసభ్యుడు గంగుల కమలాకర్‌ బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కొద్దిరోజులుగా ఆయన బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగినా కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు సర్వం సిద్ధమైందని శనివారం వార్తలు వచ్చాయి. కరీంనగర్‌ లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో బలమైన నేతగా ఉన్న కమలాకర్‌ను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని పార్టీ ముఖ్యులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు జరిగిన ప్రయత్నాలకు సానుకూల స్పందన వచ్చినట్లు చెబుతున్నారు. అయితే, ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తీవ్రంగా ఖండించారు.


ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తనను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసేందుకే రాజకీయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కొంతకాలం బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం చేసి, ఇప్పుడు కాంగ్రె్‌సలోకి వెళ్తున్నట్లు చెబుతున్నారని అన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లేది లేదని, బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సోమవారమే కాంగ్రె్‌సలో చేరేందుకు ముహూర్తం అంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అయితే, తాను ఆదివారమే విదేశాలకు వెళ్తున్నానని ఆయన తెలిపారు. పది రోజుల పాటు తన విదేశీ పర్యటన ఉంటుందన్నారు.

Updated Date - Jun 23 , 2024 | 08:11 AM