Gold Smuggling: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 1,390 గ్రాముల బంగారం పట్టివేత
ABN , Publish Date - Aug 12 , 2024 | 04:15 AM
ఓ వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు ఆదివారం పట్టుకున్నారు.
శంషాబాద్ రూరల్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఓ వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఎమిరేట్స్ విమానం ఈకే-528లో వచ్చిన ఓ వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అతని ఎడమ కాలి షూ, వీపునకు వేసుకునే బ్యాగులో బంగారాన్ని గుర్తించారు. బ్యాటరీ ఆకారంలో ఉన్న రెండు బంగారం కడ్డీలను షూ, బ్యాగులో దాచాడు. ఒక గొలుసును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం 1,390.85 గ్రాములుందని, దీని విలువ 1.06 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.