Share News

T. Harish Rao: మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర..

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:00 AM

వ్యవసాయ బోరు బావులకు కాకుండా ఇతర వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లు పెట్టాలని మాత్రమే ఉదయ్‌ ఒప్పందంలో ఉందని హరీశ్‌ రావు స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ‘‘రేవంత్‌ రెడ్డి కూడా సీనియర్‌ సభ్యుడే.

T. Harish Rao: మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర..

  • విద్యుత్తు సంస్కరణలకు మేం ఒప్పుకోలేదు

  • సభను తప్పుదోవ పట్టించే యత్నం

  • వ్యవసాయేతరానికే స్మార్ట్‌ మీటర్లు

  • ఉదయ్‌ ఒప్పందంలో ఉన్నది ఇదే

  • బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ కౌంటర్‌

వ్యవసాయ బోరు బావులకు కాకుండా ఇతర వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లు పెట్టాలని మాత్రమే ఉదయ్‌ ఒప్పందంలో ఉందని హరీశ్‌ రావు స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ‘‘రేవంత్‌ రెడ్డి కూడా సీనియర్‌ సభ్యుడే. ఎవ రైనా సభ్యుడు కాగితం తీసుకొచ్చి ఇస్తే అదే మాట్లాడతారని అనుకోలేదు. ఉదయ్‌ ఒప్పందంతో కేంద్రం బలవంతంగా రూ.9వేల కోట్లు అప్పును రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దింది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే... 2021-22 నుంచి 2024-25 దాకా ఎఫ్‌ఆర్‌బీఎంలో 0.5శాతం వెసులుబాటు ఇస్తామని కేంద్రం చెప్పినా ఒప్పుకోలేదు.


దానికి అంగీకరించి ఉంటే రూ.30 వేల కోట్లు వచ్చేవి’’అని గుర్తు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్లో కూడా ఆయన మాట్లాడారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నట్లు సంతకాలు పెట్టామని సభలో చెప్పి.. ఆ వెంటనే సీఎం మాట మార్చారని, 2017 జనవరి 4నాటి పత్రాన్ని చూపించి అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మసిపూసి మారేడుకాయ చేసినట్లు.. తమపై బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 03:00 AM