Harish Rao: వైద్యవిద్య ప్రవేశాల్లో స్థానికతపై స్పష్టతనివ్వాలి..
ABN , Publish Date - May 26 , 2024 | 04:46 AM
‘‘తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్యవిద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టతనివ్వాలి. మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు వందశాతం రాష్ట్ర విద్యార్థులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
కన్వీనర్ కోటా సీట్లు రాష్ట్ర విద్యార్థులకే దక్కాలి:హరీశ్
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్యవిద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టతనివ్వాలి. మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు వందశాతం రాష్ట్ర విద్యార్థులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. జూన్ మూడో వారంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతున్న క్రమంలో ప్రభుత్వం తక్షణం స్పందించి, ఉత్తర్వులు జారీ చేయాలని, లేకుంటే వైద్యవిద్య చదివే అవకాశాలను తెలంగాణ విద్యార్థులు కోల్పోతారని అన్నారు.
జూన్ 2 తర్వాత రాష్ట్ర విభజన చట్టానికి కాలం చెల్లుతుండటంతో పాత మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లను తెలంగాణ విద్యార్థులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, కౌన్సిలర్ నాగరాజుపై కాంగ్రెస్ నేతలు పెట్రోల్ పోసి దాడి చేయడాన్ని హరీశ్ రావు ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు.