Share News

Harish Rao: ఒకటో తేదీనే వేతనాలు ఉత్తమాటే..

ABN , Publish Date - Jul 14 , 2024 | 04:40 AM

ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామన్న ప్రభుత్వ మాట ఆచరణకు నోచుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు.

Harish Rao: ఒకటో తేదీనే వేతనాలు ఉత్తమాటే..

  • మోడల్‌ స్కూళ్ల ఉపాధ్యాయులకు జీతాలివ్వండి

  • మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామన్న ప్రభుత్వ మాట ఆచరణకు నోచుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. మోడల్‌ స్కూళ్లలోని ఉపాధ్యాయులకు తక్షణమే వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ శనివారం ఓ ప్రకటన చేశారు. మోడల్‌ స్కూళ్ల ఉపాధ్యాయులకు గత ఏడు నెలల్లో ఒక్కసారి కూడా ఒకటో తేదీన వేతనం అందలేదని హరీశ్‌ పేర్కొన్నారు.


ఈ నెలలో 13 రోజులు గడిచినప్పటికీ ఇంకా జీతాలు రాకపోవడంతో మోడల్‌ స్కూళ్లలో పని చేసే రెగ్యులర్‌ ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేసే గెస్ట్‌ లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం మాట తప్పడం బాధాకరమని హరీశ్‌ వాపోయారు.

Updated Date - Jul 14 , 2024 | 04:40 AM