Share News

Harish Rao: రాజీనామాకు నేను సిద్ధమే..!

ABN , Publish Date - Jul 19 , 2024 | 03:49 AM

రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, అందులోని 13 హామీలను ఆగస్టు 15వ తేదీ లోపు కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా అమలు చేస్తే..

Harish Rao: రాజీనామాకు నేను సిద్ధమే..!

  • అన్ని హామీలు నెరవేర్చకుంటే మీరు చేస్తారా?: హరీశ్‌ సవాల్‌

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, అందులోని 13 హామీలను ఆగస్టు 15వ తేదీ లోపు కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా అమలు చేస్తే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మరోసారి ప్రకటించారు. ఆ తేదీలోపు వీటన్నింటిని అమలు చేయకుంటే మీరు రాజీనామా చేస్తారా? అని సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు.


రాష్ట్రంలో రుణమాఫీ అమలు నేపథ్యంలో గురువారం ఓ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. రుణమాఫీ చేయలేరంటూ.. తమకు సవాల్‌ విసిరిన వ్యక్తిని రాజీనామా చేయాలని కోరమని చేసిన వ్యాఖ్యపై ‘ఎక్స్‌’ వేదికగా హరీశ్‌ స్పందించారు. తనకు పదవులు, రాజీనామాలు కొత్త కాదని, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు తన వల్ల మంచి జరుగుతుందంటే పదవులకు ఎన్ని సార్లయినా రాజీనామా చేయడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు.

Updated Date - Jul 19 , 2024 | 03:49 AM