Medak: ఏసీబీకి చిక్కిన హావేళీ ఘనపూర్ ఎస్‌ఐ..
ABN , Publish Date - Jul 09 , 2024 | 03:00 AM
అక్రమంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడిన టిప్పర్‌ను విడుదల చేసేందుకు లంచం తీసుకొని హావేళీ ఘనపూర్ ఎస్‌ఐతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టు సోమవారం ఏసీబీకి చిక్కారు.
మెదక్ అర్బన్/హావేళీ ఘనపూర్: అక్రమంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడిన టిప్పర్‌ను విడుదల చేసేందుకు లంచం తీసుకొని హావేళీ ఘనపూర్ ఎస్‌ఐతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టు సోమవారం ఏసీబీకి చిక్కారు. మెదక్‌కు చెందిన పూల గంగాధర్ టిప్పర్ గత నెల 29న ఇసుక తరలిస్తూ పట్టుబడింది. దాన్ని విడిపించేందుకు ఎస్‌ఐ కర్రె ఆనంద్‌గౌడ్ రూ.30 వేలు డిమాండ్ చేయగా.. రూ.20 వేలకు ఒప్పందం కుదిరింది.
దీనిపై గంగాధర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం మహమ్మద్ మస్తాన్ అనే వ్యక్తి ఘనపూర్ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి డబ్బులు తీసుకెళ్లి ఎస్‌ఐకి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మస్తాన్.. మెట్రో ఈవెనింగ్స్‌లో జర్నలి్‌స్టగా పని చేస్తున్నారు.