Share News

MBBS Admissions: ఎంబీబీఎస్‌ ప్రవేశాల స్థానికతపై తీర్పు రిజర్వు

ABN , Publish Date - Aug 30 , 2024 | 04:44 AM

ఎంబీబీఎస్‌, బీడీఎ్‌సలో కాంపిటెంట్‌ కోటా కింద 85 శాతం సీట్లలో ప్రవేశాలకు ఎవరు స్థానికులు అన్న వివాదంపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.

MBBS Admissions: ఎంబీబీఎస్‌ ప్రవేశాల స్థానికతపై తీర్పు రిజర్వు

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌, బీడీఎ్‌సలో కాంపిటెంట్‌ కోటా కింద 85 శాతం సీట్లలో ప్రవేశాలకు ఎవరు స్థానికులు అన్న వివాదంపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. నీట్‌ పరీక్షకు ముందు వరుసగా నాలుగు సంవత్సరాలు (ఇంటర్‌, పది, తొమ్మిది తరగతులు) తెలంగాణలోనే చదివి ఉండటంతోపాటు పరీక్షలు సైతం ఇక్కడే రాసి ఉండాలని ప్రభుత్వం జారీచేసిన జీవో 33 చట్టబద్ధతపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావు ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది.


ఇంటర్‌ వేరే రాష్ట్రాల్లో చదివినంత మాత్రాన తెలంగాణ నివాసులు అనర్హులుగా మారిపోతున్నారని.. కొన్నేళ్లు తెలంగాణలో చదివిన నాన్‌లోకల్స్‌ అర్హులుగా మారుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 07:21 AM