Share News

Hyderabad: డీజిల్‌ డబ్బులు అధికారులకు.. దోమలతో కష్టాలు ప్రజలకు

ABN , Publish Date - Aug 06 , 2024 | 08:57 AM

ఏటా రూ.15 కోట్లు వెచ్చిస్తున్నా గ్రేటర్‌లో దోమల తీవ్రత పెరుగుతోంది. డెంగీ, మలేరియా(Dengue, Malaria) కేసులు అధికమవుతున్నాయి. లార్వా దశలో నియంత్రణకు రసాయనాల వినియోగం కాగితాలకే పరిమితమవుతోంది. ఫాగింగ్‌లో వాడాల్సిన డీజిల్‌ను అధికారులు తాగేస్తుండడంతో దోమలు ప్రజల రక్తం తాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగంలో బయటపడిన మరో అవినీతి బాగోతం ఇందుకు నిదర్శనం.

Hyderabad: డీజిల్‌ డబ్బులు అధికారులకు.. దోమలతో కష్టాలు ప్రజలకు

- జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగంలో అక్రమాలు

- ఓ ఎస్‌ఈ తీరు చర్చనీయాంశం

- డబ్బులు తీసుకుంటున్న వీడియో వైరల్‌

- గతంలోనూ ఆమె తీరు వివాదాస్పదం

హైదరాబాద్‌ సిటీ: ఏటా రూ.15 కోట్లు వెచ్చిస్తున్నా గ్రేటర్‌లో దోమల తీవ్రత పెరుగుతోంది. డెంగీ, మలేరియా(Dengue, Malaria) కేసులు అధికమవుతున్నాయి. లార్వా దశలో నియంత్రణకు రసాయనాల వినియోగం కాగితాలకే పరిమితమవుతోంది. ఫాగింగ్‌లో వాడాల్సిన డీజిల్‌ను అధికారులు తాగేస్తుండడంతో దోమలు ప్రజల రక్తం తాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగంలో బయటపడిన మరో అవినీతి బాగోతం ఇందుకు నిదర్శనం. సంస్థలోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి(Kukatpally, Serilingampally) జోన్ల సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌ సంధ్య అరాచకాలు చర్చనీయాంశంగా మారాయి. ఎంటమాలజీ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో ఫాగింగ్‌ చేయకుండానే రసాయనాలు, డీజిల్‌ వినియోగించినట్టు బిల్లులు డ్రాచేశారు. పోల్‌ స్లిప్పుల పంపిణీ, ఇతరత్రా పనుల కోసం పది రోజులపాటు ఎన్నికల విధులు నిర్వహించినట్టు అక్కడి ఎంటమాలజీ సిబ్బంది అలవెన్సులు తీసుకున్నారు.

ఇదికూడా చదవండి: Collector: చెత్తను ఎత్తిపోసిన కలెక్టర్‌..


ఆ సమయంలో ఫాగింగ్‌, ఏఎల్‌ఓ చేసినట్టు బిల్లులు డ్రా చేయడం గమనార్హం. కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలోని ఎంటమాలజీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ (ఈఎఫ్ఏ) నుంచి ఆమె డబ్బులు తీసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రతి నెలా అసిస్టెంట్‌ ఎంటమాలజిస్టులు, ఈఎఫ్ఏలు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఆమెకు కప్పం కట్టాల్సిందే. లేని పక్షంలో వేధింపులు తప్పవు. రెండేళ్లుగా మిషన్ల ఆపరేటర్లు లేకపోయినా, యంత్రాలు పని చేస్తున్నట్టు బిల్లులు డ్రా చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి.

city2.2.jpg


గతంలోనూ..

గతంలో ఖమ్మం, వరంగల్‌(Khammam, Warangal)లో పని చేసిన ఆమె తీరుపై ఆరోపణలున్నాయి. అక్రమాల నేపథ్యంలో ఆమెను సస్పెండ్‌ చేశారని ప్రచారం జరుగుతోంది. ఎక్కడ పని చేసినా ఏఎల్‌ఓ, ఫాగింగ్‌ చేయకుండా డీజిల్‌ బిల్లులు తీసుకోవడం.. రసాయనాలు వినియోగించకుండా బిల్లులు చెల్లించడం ఆమెకు అలవాటుగా చెబుతున్నారు. ‘త్వరలో చీఫ్‌ ఎంటమాలజిస్ట్‏గా పదోన్నతి వస్తుందని.. జీహెచ్‌ఎంసీ అంతా నా చేతిలోనే ఉంటుంది.. ఒక్కొక్కరి సంగతి చెబుతా’ అని ఆమె సిబ్బందిని భయపెడుతుంటారు. బదిలీల్లో భాగంగా వరంగల్‌ జిల్లా డీఎంఈగా పదోన్నతి లభించినా.. జీహెచ్‌ఎంసీ(GHMC) నుంచి ఆమె కదలడం లేదు. కార్యదర్శి హోదాలో ఉన్న ఓ ఐఏఎస్‌ పేరు చెబుతూ తనను ఎవరూ ఏం చేయలేరని విర్రవీగుతారని ఆరోపణలు వచ్చాయి. సంధ్యను కలిసేందుకు వచ్చే బంధువులు, స్నేహితుల హోటల్‌, భోజనం ఖర్చులూ కింది స్థాయి సిబ్బంది చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఆమె విషయంలో ఉన్నతాధికారులు మిన్నకుంటుండడం అనుమానాలకు తావిస్తోంది.


ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!

Updated Date - Aug 06 , 2024 | 09:01 AM