Hyderabad: ఆ మున్సిపాలిటీలో.. బెడిసి కొడుతున్న కాంగ్రెస్ ప్రయత్నాలు..
ABN , Publish Date - May 21 , 2024 | 12:42 PM
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ(Gundlapochampally Municipality) చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టడానికి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. మొత్తం 15 మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీలో ఇద్దరు బీజేపీ, ఒకరు కాంగ్రెస్, 12 మంది బీఆర్ఎస్కు చెందిన వారు ఉన్నారు.
- అవిశ్వాసం కోసం మరోసారి తెరపైకి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ
- వేరువేరుగా విహారయాత్రలకు బయలుదేరిన బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు
హైదరాబాద్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ(Gundlapochampally Municipality) చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టడానికి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. మొత్తం 15 మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీలో ఇద్దరు బీజేపీ, ఒకరు కాంగ్రెస్, 12 మంది బీఆర్ఎస్కు చెందిన వారు ఉన్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల ముందు ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో, మరో ఇద్దరు బీజేపీలో చేరారు. దీంతో బీఆర్ఎస్లో 8 మంది కౌన్సిలర్లు మాత్రమే మిగిలారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో మున్సిపల్ వైస్‌చైర్మన్ ప్రభాకర్ ఉండటం గమనార్హం. ఇప్పటికే నియోజక వర్గంలోని పలు మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌లలో అవిశ్వాసం కోసం కాంగ్రెస్ పావులు కదుపుతుండటంతో ముందు జాగ్రత్తగా గుండ్లపోచంపల్లి చైర్‌పర్సన్ భర్త మద్దుల శ్రీనివాస్ రెడ్డి కొంత మంది కౌన్సిలర్లతో విహారయాత్రకు బయలు దేరారు.
ఇదికూడా చదవండి: BRS: నాలుగు నెలలుగా వారికి జీతాలు లేవు: హరీష్ రావు
నిరాశలో కాంగ్రెస్ నేతలు
బ్యాంకాక్ విహరయాత్రకు వెళ్లిన వారిలో ఇటీవ కాంగ్రెస్‌లో చేరిన మున్సిపల్ వైస్‌చైర్మన్ ప్రభాకర్ ఉండటం విశేషంగా మారింది. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వైస్‌చైర్మన్ ప్రభాకర్ తమ పార్టీలోకి రావడంతో చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టడం సులభంగా మారుతుందని కాంగ్రెస్ నేతలు భావించినప్పటికీ ప్రభాకర్ మాత్రం చైర్‌పర్సన్ భర్తతో టూర్‌కు వెళ్లటం కాంగ్రెస్ నేతలకు షాక్‌కు గురిచేసింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం వ్యూహాత్మకంగా చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్న తరుణంలో వైస్ చైర్మన్ ప్రభాకర్ తీరు కాంగ్రెస్ పెద్దలకు నిరాశమిగిలించిందని పలువురు అంటున్నారు.
అవిశ్వాసానికి విముఖత చూపుతున్నట్లు ప్రచారం
అవిశ్వాసం పెట్టనీయకుండా మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నిస్తునట్టు తెలిసింది. కాంగ్రెస్‌కు అవిశ్వాసం కోసం అవసరపడే సంఖ్యాబలం లేనప్పటికీ అధికార బలంతో కౌన్సిలర్లను ప్రలోభ పెట్టే అవకాశాలు ఉన్నందున బీఆర్‌ఎస్ పార్టీ జాగ్రత్తపడుతోంది. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ తప్పా బీజేపీ కౌన్సిలర్లు ముందునించి చైర్‌పర్సన్‌కు విధేయులుగా ఉన్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో చైర్‌పర్సన్‌పై పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వరాదని వారు దూరం వెళ్లినట్టు ప్రచారం కొనసాగుతోంది. దీనికి తోడు ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లు సైతం అవిశ్వాసానికి విముఖత చూపుతున్నట్లు ప్రచారం కొనసాగుతున్నది.
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News