Share News

Hyderabad: లాంజ్ యాప్‏తో లూటీ..

ABN , Publish Date - Oct 30 , 2024 | 08:03 AM

సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను టార్గెట్‌ చేసి ‘లాంజ్‌ యాప్‌’ ద్వారా డబ్బు కాజేస్తున్న సంఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఎయిర్‌పోర్ట్‌(Airport)లో వినియోగించే లాంజ్‌ యాప్‌లో సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టారు. తద్వారా సేకరించిన సమాచారంతో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును కాజేస్తున్నారు.

Hyderabad: లాంజ్ యాప్‏తో లూటీ..

- వెలుగులోకి సరికొత్త సైబర్‌ నేరం

- రెండు నెలల్లో రూ.9 లక్షలు కాజేత

హైదరాబాద్‌ సిటీ: సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను టార్గెట్‌ చేసి ‘లాంజ్‌ యాప్‌’ ద్వారా డబ్బు కాజేస్తున్న సంఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఎయిర్‌పోర్ట్‌(Airport)లో వినియోగించే లాంజ్‌ యాప్‌లో సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టారు. తద్వారా సేకరించిన సమాచారంతో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును కాజేస్తున్నారు. ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో నకిలీ లాంజ్‌ యాప్‌ ద్వారా 450 మంది ప్రయాణికుల నుంచి సుమారు రూ. 9 లక్షలు కాజేసినట్లు థ్రెట్‌ రీసెర్చ్‌ టీమ్‌ నివేదికలో వెల్లడయింది.

ఈ వార్తను కూడా చదవండి: ఫాంహౌస్‌ కేసులో విచారణ వేగవంతం


ఈ యాప్‌ ప్రమాదకరమని సదరు సంస్థ హెచ్చరించింది. ఈ తరహా మోసంలో డబ్బు పోగొట్టుకున్న బాధితురాలు పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అయింది. బెంగళూరు విమానాశ్రయం(Bangalore Airport)లో ఓ ప్రయాణికురాలు విమానం బయలుదేరేందుకు సమయం ఉండటంతో లాంజ్‌కు వెళ్లింది. సిబ్బంది సూచన మేరకు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసింది. వచ్చిన లింక్‌ ద్వారా ‘లాంజ్‌ యా్‌ప’ను ఇన్‌స్టాల్‌ చేసుకుంది. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో వ్యక్తిగత వివరాలతోపాటు సెక్యూరిటీ ఫీచర్ల పేరుతో ఫేస్‌ స్ర్కీనింగ్‌ కూడా చేసింది.


యాప్‌లో మొబైల్‌ స్ర్కీన్‌ షేరింగ్‌ చేస్తున్నట్లు గుర్తించినా, పని ఒత్తిడి, తొందరపాటులో ఈ విషయం గురించి పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఆమెకు ఫోన్‌లు, మెసేజ్‌లు రాకపోవడంతో నెట్‌వర్క్‌ సమస్య అని భావించింది. ఆమెకు ఫోన్‌ చేసిన స్నేహితులు, వేరే వ్యక్తి ఫోన్‌ రిసీవ్‌ చేసుకుంటున్నాడని చెప్పినా పని వత్తిడి, కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాల వల్ల ఈ విషయంపై దృష్టి సారించలేదు.


తన క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 87,123 వేరే ఖాతాకు బదిలీ అయ్యాయని సందేశం రావడంతో అప్రమత్తమైంది. వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించి క్రెడిట్‌ కార్డును బ్లాక్‌ చేయించింది. ఈ మోసానికి ‘లాంజ్‌ యాప్‌’ కారణమని గుర్తించింది. యాప్‌ ద్వారా మొబైల్‌లో సెట్టింగ్స్‌ మార్చిన సైబర్‌ నేరగాళ్లు తనకు రావాల్సిన ఫోన్‌లు, మెసేజ్‌లు, ఓటీపీలు సేకరించి డబ్బు కాజేశారని పేర్కొంది. యాపిల్‌ ఫోన్‌ వినియోగిస్తున్నా రక్షణ లేకుండా పోయిందని బాధితురాలు వాపోయింది.


మోసాలు ఇలా..

విమానాశ్రయాల్లో ప్రయాణికులు సాధారణంగా లాంజ్‌లను ఆశ్రయిస్తారు. ఇదే అదునుగా భావించిన సైబర్‌ నేరగాళ్లు ‘లాంజ్‌ యా్‌ప’లో లాంగ్‌ ఈపా్‌సడాట్‌ ఇన్‌ వంటి అప్లికేషన్‌లను జొప్పించారు. ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న వారి మొబైల్‌లోని సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లకు చేరవేస్తుంది. మొబైల్‌లో ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు సేకరించడమే కాకుండా మొబైల్‌కు వచ్చే సందేశాలు, ఓటీపీలను నియంత్రిస్తుంది. నేరగాళ్లు బ్యాంకులో నగదు బదిలీ సందర్భంగా వచ్చే ఓటీపీలు కూడా తమకే వచ్చేలా మొబైల్‌ సెట్టింగ్స్‌ మార్చుతున్నారు.


మొబైల్‌ను అధీనంలోకి తీసుకుని కాల్‌ ఫార్వార్డింగ్‌ ఆప్షన్‌లో తమ నంబర్‌లు పెట్టడం ద్వారా ఫోన్‌లు, సందేశాలు, ఓటీపీలు వారికే వెళ్లేలా చేసుకుంటున్నారు. బ్యాంకు ఖాతా, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వివరాలు తెలుసుకొని, ఓటీపీల సాయంతో డబ్బులు కాజేస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన సైబర్‌ నిపుణులు రివర్స్‌ ఇంజనీరింగ్‌ చేసి ఈ యాప్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు ఎలా మోసం చేస్తున్నారో గ్రహించారు. లాంజ్‌ యాప్‌ మాత్రమే కాకుండా కొత్త అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఈ యాప్‌ల ద్వారా సేకరించిన సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశముందన్నారు.


ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మట్టి రోడ్డు లేకుండా చేస్తాం

ఈవార్తను కూడా చదవండి: యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు 7,037 కోట్ల అదనపు రుణం

ఈవార్తను కూడా చదవండి: KTR : కాంగ్రెస్‌ దాడులను ఎదుర్కొందాం

ఈవార్తను కూడా చదవండి: టీజీఎస్పీ పోలీసుల వైఖరిపై నిఘా

Read Latest Telangana News and National News

Updated Date - Oct 30 , 2024 | 08:03 AM