Share News

Hyderabad: జాడలేని మాన్‌సూన్‌ టీంలు..

ABN , Publish Date - Aug 21 , 2024 | 10:01 AM

ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతం. మంగళవారు తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 6 గంటల వరకు కుండపోతగా వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకూ రహదారులపై వరద నీరు నిలిచే ఉంది. కొన్ని బస్తీలు నీటి ముంపులోనే ఉన్నాయి.

Hyderabad: జాడలేని మాన్‌సూన్‌ టీంలు..

- మధ్యాహ్నం 12 గంటల వరకూ రోడ్లపైనే వరద నీరు

- కాలనీలు, బస్తీల్లో పరిస్థితి అధ్వానం

- నీటి ముంపులోనే స్థానికులు

- సాయంత్రం మరోసారి దంచి కొట్టిన వాన

- అయినా.. అందుబాటులో లేని అత్యవసర బృందాలు

- క్షేత్రస్థాయిలో పర్యటించని అధికారులు

- ప్రజాప్రతినిధులు, నేతలు ఫోన్లు చేస్తే కానీ కానరాని స్పందన

- జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, టీజీఎస్పీడీసీఎల్‌లోనూ అధికారులది అదే తీరు

హైదరాబాద్‌ సిటీ: ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతం. మంగళవారు తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 6 గంటల వరకు కుండపోతగా వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకూ రహదారులపై వరద నీరు నిలిచే ఉంది. కొన్ని బస్తీలు నీటి ముంపులోనే ఉన్నాయి. దీంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచాయి. అయినా ఎక్కడా మాన్‌సూన్‌ టీం(Monsoon team)ల జాడ కనిపించలేదు.

సాధారణంగా వర్షం తగ్గిన ఒకటి, రెండు గంటల్లో వరద నీరు వెళ్లిపోతుంది. కానీ మంగళవారం మాత్రం మెజార్టీ ప్రాంతాల్లో ఆ పరిస్థితి కనిపించలేదు.

ఇదికూడా చదవండి: Cyber ​​criminals: ‘బ్యాంక్‌ స్కామ్‌లో మీకు లింకు ఉంది’


క్షేత్రస్థాయిలో జీహెచ్‌ఎంసీ(GHMC), ఇతర విభాగాల మాన్‌సూన్‌ బృందాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడమే కారణం. క్యాచ్‌పిట్ల వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం తీసే వారు లేకపోవడంతో గంటల తరబడి రోడ్లపై నీరు నిలిచింది. ఆజంపురా ఆర్‌యూబీ, అండర్‌పా్‌సలో చెత్తా చెదారం పేరుకుపోవడంతో భారీగా వరద నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. బండ్లగూడలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా వరద నీటిని తొలగించలేదు. వర్షపు నీటితో పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కమిషనర్‌, ఒకరిద్దరు జోనల్‌ కమిషనర్లు మినహా అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించ లేదు.

city4.3.jpg


కాగితాల్లోనేనా..?

గ్రేటర్‌లో వరద నివారణకు జీహెచ్‌ఎంసీ 242 స్టాటిక్‌, 157 మొబైల్‌ టీంలను ఏర్పాటు చేసింది. సీఆర్‌ఎంపీ(CRMP) రహదారులపై 29, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(డీఆర్‌ఎఫ్‌) బృందాలు 30 ఉన్నాయి. వీటితోపాటు వాటర్‌బోర్డు 25... టీజీఎస్పీడీసీఎల్‌ 41 బృందాలను రంగంలోకి దించింది. ఈ బృందాల్లో సగం టీంలు కూడా భారీ వర్షం నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కనిపించలేదు. వాటర్‌బోర్డు, టీజీఎ్‌సపీడీసీఎల్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. విద్యుత్‌ శాఖకు సంబంధించి ఎన్ని బృందాలు ఉన్నాయి..? ఒక్కో టీంలో ఎంత మంది పని చేస్తారు..? అన్న వివరాలూ గోప్యంగా ఉంచుతుండడం అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, స్థానిక నేతలు పలుమార్లు ఫోన్‌ చేస్తే కానీ మాన్‌సూన్‌ బృందాలు రాకపోవడం గమనార్హం. ముషీరాబాద్‌, అంబర్‌పేట, ఉప్పల్‌(Mushirabad, Amberpet, Uppal), ఎల్‌బీనగర్‌, మలక్‌పేట ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు వరద నీటి తొలగింపునకు అధికారుల వెంట పడాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో క్యాచ్‌పిట్లు, మ్యాన్‌హోల్‌ మూతలు స్థానికులు తెరిచి వరద నీరు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

city4.jpg


సాయంత్రమూ అదే దుస్థితి

మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో మళ్లీ వాన దంచి కొట్టింది. ఆ సమయంలోనూ రోడ్లపై మాన్‌సూన్‌ బృందాలు కనిపించిన దాఖలాలు లేవు. లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, మసాబ్‌ట్యాంక్‌(Khairatabad, Masabtank), పబ్లిక్‌ గార్డెన్‌, బషీర్‌బాగ్‌ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచింది. చింతల్‌కుంట రోడ్డులో మోకాలిలోతు నీరు నిలవడంతో పాదచారులు ఆ మార్గంలో వెళ్లేందుకు భయాందోళనకు గురయ్యారు. ద్విచక్ర వాహనదారులూ నీటి నుంచి వెళ్లేందుకు జంకారు. కార్లు, ఆటోలు వరద నీటిలో నిలిచిపోయాయి.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 21 , 2024 | 10:01 AM