Hyderabad: విమానంలో ప్రయాణికుడి న్యూసెన్స్.. దుబాయ్ నుంచి శంషాబాద్ వస్తున్న ఫ్లైట్‌లో ఘటన
ABN , Publish Date - Dec 06 , 2024 | 07:51 AM
దుబాయ్ నుంచి శంషాబాద్(Dubai to Shamshabad) ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు న్యూసెన్స్ చేశాడు. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన నర్సింహులు కొన్ని నెలల క్రితం పని కోసమని దుబాయ్ వెళ్లాడు.
- కేసు నమోదు చేసిన ఆర్జీఐఏ పోలీసులు
శంషాబాద్(హైదరాబాద్): దుబాయ్ నుంచి శంషాబాద్(Dubai to Shamshabad) ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు న్యూసెన్స్ చేశాడు. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన నర్సింహులు కొన్ని నెలల క్రితం పని కోసమని దుబాయ్ వెళ్లాడు. అయితే, అక్కడ అతడి మానసికస్థితి సరిగా లేక తిరిగి హైదరాబాద్(Hyderabad)కు బయలుదేరాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పైసలిస్తేనే పనులు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, వార్డుబాయ్‌ల దందా
అయితే, విమానం ఎక్కిన తర్వాత నర్సింహులు పిచ్చిగా ప్రవర్తిస్తూ.. నా కుమారుడికి బాగోలేదు, విమానాన్ని ఆపాలని ఎయిర్ హోస్టె్‌సలకు చెప్పాడు. దాంతో వారు మీ కుమారుడు ఎక్కడున్నాడు.? విమానాన్ని ఎక్కడ ఆపాలి? అని నర్సింహులుని అడిగారు? అయితే, అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎయిర్‌హోస్టెస్ పైౖలెట్లకు సమాచారం ఇచ్చారు.
కాగా, విమానం దుబాయ్ నుంచి బెంగళూరు(Dubai to Bangalore) వయా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సి ఉంటుంది. దాంతో అతడికి బెంగళూరు ఎయిర్‌పోర్టులో పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించినా ఏమాత్రం మార్పు రాలేదు. అనంతరం బెంగళూరు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తుండగా మళ్లీ న్యూసెన్స్ చేయడంతో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
బుధవారం అర్ధరాత్రి 11.50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు విమానం చేరుకుంది. నర్సింహులును ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకొని న్యూసెన్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి మతిస్థిమితం సరిగాలేదని అతడి భార్య చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!
ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!
Read Latest Telangana News and National News