Asaduddin Owaisi: హైదరాబాద్ షా అసదుద్దీన్ ఐదోసారి.. రికార్డు మెజారిటీ!
ABN , Publish Date - Jun 05 , 2024 | 04:49 AM
హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు మరోసారి మజ్లిస్ పార్టీకే పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి, సిటింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఏకంగా 3,38,087 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. అసదుద్దీన్‌కు 6,61,981 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు 3,23,894 ఓట్లు వచ్చాయి.
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు మరోసారి మజ్లిస్ పార్టీకే పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి, సిటింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఏకంగా 3,38,087 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. అసదుద్దీన్‌కు 6,61,981 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు 3,23,894 ఓట్లు వచ్చాయి. ఇక మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి వలియుల్లా సమీర్ 62,962 ఓట్లతో, నాలుగో స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ 18,641 ఓట్లు పొంది డిపాజిట్లు కోల్పోయారు. 2019 ఎన్నికల్లో మజ్లి్‌సకి 58.9ు ఓట్లు పోలవగా ఈసారి 61.28ు ఓట్లు పోలవడం విశేషం. మజ్లిస్ ప్రధాన ప్రత్యర్థి ఎంబీటీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో అసద్ భారీ మెజారిటీ సాధించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2004 నుంచి అసదుద్దీన్ ఒవైసీ 5సార్లు వరుసగా హైదరాబాద్ స్థానం నుంచి గెలిచారు.
భారీగా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్యన
క్రాస్ ఓటింగ్ ఓట్లు భారీగా క్రాస్ అయ్యాయి. బీఆర్‌ఎస్ ఓట్లు లక్షల్లో బీజేపీకి
బదిలీ అయ్యాయి. కొన్నిచోట్ల కాంగ్రెస్ ఓట్లూ బీజేపీకి మళ్లాయి.
నియోజకవర్గం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీ ఓట్లు 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలవారీ ఓట్లు
బీజేపీ కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్‌ఎస్
ఆదిలాబాద్ 4,47,000 2,50,439 4,63,683 5,68,168 4,77,516 1,37,300
కరీంనగర్ 2,50,350 5,13,055 5,17,601 5,85,116 3,59,907 2,82,163
నిజామాబాద్ 3,65,374 4,08,135 4,17,315 5,92,318 4,83,077 1,02,406
మల్కాజిగిరి 4,19,839 5,89,585 9,38,064 9,91,042 5,99,567 3,00,486
నల్లగొండ 73,449 7,66,069 4,78,631 2,24,432 7,84,337 2,18,417
భువనగిరి 74,782 8,17,279 5,60,002 4,06,973 6,29,143 2,56,187
మహబూబాబాద్ 34,431 6,85,897 4,43,910 1,10,444 6,12,774 2,63,609
పెద్దపల్లి 79,309 6,82,033 3,74,363 3,44,223 4,75,587 1,93,356
జహీరాబాద్ 1,71,035 5,48,817 5,29,648 4,82,230 5,28,418 1,72,078
మెదక్ 2,11,626 4,20,881 6,68,919 4,71,217 4,32,078 3,96,790
చేవెళ్ల 3,35,504 6,09,527 7,07,456 8,09,882 6,36,985 1,78,968
మహబూబ్‌నగర్ 1,13,080 6,11,514 5,11,077 5,10,747 5,06,247 1,54,792
నాగర్ కర్నూల్ 1,16,558 6,39,628 5,34,401 3,70,658 4,65,072 3,21,343
వరంగల్ 1,56,638 6,63,556 5,03,298 3,60,955 5,81,294 2,32,033
ఖమ్మం 16,696 7,33,293 4,85,639 1,18,636 7,66,929 2,99,082
హైదరాబాద్ 2,21,954 1,01,014 1,71,497 3,23,894 62,962 6,61,981క
సికింద్రాబాద్ 1,96,410 2,80,337 4,63,740 4,73,012 4,23,068 1,29,586