Share News

Hyderabad: 164 కిలోల గంజాయి, 1.65 కిలోల గంజాయి చాక్లెట్లు సీజ్‌..

ABN , Publish Date - Jun 17 , 2024 | 05:04 AM

ఒడిసా నుంచి హైదరాబాద్‌కు గుట్టుగా గంజాయి తరలిస్తున్న రెండు అంతర్రాష్ట ముఠాలకు చెందిన ఆరుగురిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 164 కిలోల గంజాయి, మూడు కార్లు, ఓ బైక్‌, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: 164 కిలోల గంజాయి, 1.65 కిలోల గంజాయి చాక్లెట్లు సీజ్‌..

  • వేర్వేరు కేసుల్లో ఏడుగురి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ఒడిసా నుంచి హైదరాబాద్‌కు గుట్టుగా గంజాయి తరలిస్తున్న రెండు అంతర్రాష్ట ముఠాలకు చెందిన ఆరుగురిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 164 కిలోల గంజాయి, మూడు కార్లు, ఓ బైక్‌, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రష్మి పెరుమాళ్‌ సీసీఎ్‌సలో ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. హుమాయున్‌నగర్‌ పోలీ స్‌ స్టేషన్‌ పరిధిలో భారీ మొత్తంలో గంజాయి దిగుమతి అవుతుందనే సమాచారంతో దాడి చేసిన పోలీసులు ఓ ముఠాను పట్టుకుని వారి వద్ద వంద కిలోల గంజాయిని సీజ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా పిట్లాంకు చెందిన ధారావత్‌ రవి, మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన సయ్యద్‌ బహదూర్‌, ఆనంద్‌ రామ్‌జీ కదమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు ధారావత్‌ రవి ఇటీవల ఒడిశా వెళ్లి అక్కడ ఓ రైతు దగ్గర 100 కిలోల గంజాయి కొనుగోలు చేశాడు.


దానిని 32 ప్యాకెట్లుగా మార్చి బహదూర్‌, ఆనంద్‌ రామ్‌జీ సహకారంతో కారులో హైదరాబాద్‌కి తరలించి పోలీసులకు పట్టుబడాడు. మరో కేసులో ఇదే తరహాలో ఒడిసా నుంచి నగరానికి గంజాయి తీసుకొచ్చిన హైదరాబాద్‌కు చెందిన షేక్‌ సర్వేజ్‌, అబ్థుల్‌ రవూఫ్‌, మహ్మద్‌ అన్వర్‌ అరెస్టయ్యారు. వారి నుంచి 64 కిలోల గంజాయిని చేసుకున్నారు. ఆసి్‌ఫనగర్‌కు చెందిన షేక్‌ పర్వేజ్‌ గతంలో రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించాడు. ఇటీవల బయటికొచ్చిన పర్వేజ్‌ ఒడిసా వెళ్లి జైలులో అతనికి పరిచయమైన గంజాయి రైతు దీపక్‌ను కలిశాడు. దీపక్‌ నుంచి 64 కిలోల గంజాయి తీసుకుని రవూఫ్‌, అన్వర్‌తో కలిసి హైదరాబాద్‌కు తీసుకొచ్చి పోలీసులకు చిక్కాడు. మరో కేసులో యూపీ నుంచి హైదరాబాద్‌కు గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని శేరిలింగంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 1.65 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌ పరిధిలో పార్టీలు, ఈవెంట్లలో తనిఖీలు చేసిన ఎక్సైజ్‌ పోలీసులు 8 మత్తు పదార్థాల ప్యాకెట్లను సీజ్‌ చేశారు.

Updated Date - Jun 17 , 2024 | 05:04 AM