Share News

Hyderabad: కిం కర్తవ్యం.. నేడు ఏపీకి ఆమ్రపాలి

ABN , Publish Date - Oct 16 , 2024 | 07:38 AM

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటివ్‌ ట్రిబ్యునల్‌ (సీఏటీ) నిరాకరించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) ఏపీకి వెళ్లాల్సిన అనివార్యత ఏర్పడింది.

Hyderabad: కిం కర్తవ్యం.. నేడు ఏపీకి ఆమ్రపాలి

- అక్కడ రిపోర్ట్‌ చేసే అవకాశం

- ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా సర్ఫరాజ్‌?

- ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరిస్తే తిరిగి వచ్చే అవకాశం

- లేని పక్షంలో బల్దియాకు కొత్త బాస్‌

- ఏపీ కేడర్‌గా ఉన్నా.. గతంలో తెలంగాణలోనే సోమేష్‌

హైదరాబాద్‌ సిటీ: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటివ్‌ ట్రిబ్యునల్‌ (సీఏటీ) నిరాకరించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) ఏపీకి వెళ్లాల్సిన అనివార్యత ఏర్పడింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఐఏఎస్‌ అధికారులు భావిస్తున్నా, డీఓపీటీ విధించిన గడువు నేటితో ముగియనున్న దృష్ట్యా.. ఏపిలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారొకరు తెలిపారు. కేటాయించిన రాష్ర్టాలకు వెళ్లండి.. తుది విచారణ తరువాత చేపడతామని క్యాట్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ప్రముఖ గైనకాలజిస్ట్‌ కొత్త ఉషాలక్ష్మి కన్నుమూత


ఈ నేపథ్యంలో ఆమ్రపాలి స్థానంలో ప్రస్తుతానికి ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించే అవకాశమున్నట్టు సమాచారం. ఆమ్రపాలి ఏపీలో రిపోర్ట్‌ చేయడానికి ముందే తెలంగాణ నుంచి రిలీవ్‌ కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బల్దియా బాస్‌ను నియమించక తప్పని పరిస్థితి. రాష్ట్ర విభజన సమయంలో ఆమ్రపాలిని ఏపీ కేడర్‌ అధికారిగా గుర్తించారు. వ్యక్తిగత వివరాల్లో విశాఖపట్టణం శాశ్వత చిరునామాగా పేర్కొన్న నేపథ్యంలో ఆమెను ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌గా గుర్తించారు.


city1.2.jpg

అయినా ఆమె తెలంగాణలో పని చేస్తున్నారు. చిన్న వయసులోనే కీలకమైన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గానూ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. జూన్‌ 26వ తేదీన ఆమె బల్దియా కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆగస్టు 20న ఆమెను రెగ్యులర్‌ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. దాదాపు 110 రోజులు తనదైన శైలిలో ఆమె పని చేశారు. ఇంతలోనే డీఓపీటీ ఉత్తర్వులు వెలువడ్డాయి.


ఇరు రాష్ర్టాల ప్రభుత్వాలు అంగీకరిస్తే..

డీఓపీటీ ఉత్తర్వులతో ఏపీలో ఆమ్రపాలి రిపోర్ట్‌ చేసినా.. తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం లేకపోలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇరు రాష్ర్టాల ప్రభుత్వాలు పరస్పర అంగీకారంతో అధికారులను యథాతధంగా కొనసాగించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఆమ్రపాలి ఏపీలో రిపోర్ట్‌ చేసిన అనంతరం.. అక్కడి సర్కారు అంగీకరిస్తే తిరిగి తెలంగాణలో విధులు నిర్వర్తించే అవకాశముంది. ఈ విషయంలో రెండు ప్రభుత్వాలు సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.


ఏడుగురు ఐఏఎస్‏ల కేడర్‌పై ప్రస్తుతం వివాదం కొనసాగుతోంది. ఏపీ కేడర్‌కు చెందిన నలుగురు ఐఏఎ్‌సలు తెలంగాణలో, తెలంగాణ కేడర్‌కు చెందిన ముగ్గురు ఏపీలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. కేటాయించిన రాష్ట్రంలోనే ఐఏఎ్‌సలు పని చేయాలని ప్రభుత్వాలు భావించిన నేపథ్యం లో ఆమ్రపాలి ఏపీలోనే కొనసాగాల్సి ఉంటుంది. అదే జరిగితే.. బల్దియాకు సీనియర్‌ ఐఏఎస్‏ను నియమిస్తారా..? జూనియర్‌కు బాధ్యతలు అప్పగిస్తారా..? అన్నది తేలాల్సి ఉంది.


డీఓపీటీ ఉత్తర్వులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి ఉంటారా.. లేదా..? అన్న చర్చ నాలుగు రోజులుగా అధికార వర్గాల్లో జోరుగా సాగింది. క్యాట్‌ ఆదేశాలు వెలువడినా.. ఏపీ నుంచి ఆమె తిరిగి వస్తారా..? లేదా..? అన్న చర్చా మొదలైంది. ఏపీ కేడర్‌గా గుర్తించిన సోమేష్ కుమార్‌ తొమ్మిదేళ్లు తెలంగాణలో పని చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న సమయంలోనే కేడర్‌ వివాదం రాగా, క్యాట్‌ను ఆశ్రయించిన ఆయన ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అనివార్య పరిస్థితుల్లో సోమేష్‌ ఏపీలో రిపోర్ట్‌ చేశారు. అనంతరం స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు.


ఇదికూడా చదవండి: CM Revanth Reddy: సీఎం సంతకం చేసినా బదిలీల్లేవ్‌!

ఇదికూడా చదవండి: KTR: విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న సర్కార్‌

ఇదికూడా చదవండి: తాళం వేస్తే కేసులు.. ఎవరి మాటల్తోనో కవ్వింపు చర్యలొద్దు

ఇదికూడా చదవండి: Gurukulas: గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 16 , 2024 | 09:03 AM