EX MLA Shakeel : మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో కీలక మలుపు
ABN , Publish Date - Dec 16 , 2024 | 09:48 AM
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో 2022 మార్చిలో ఈ కారు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో నెలల వయసున్న చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో రహిల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
హైదరాబాద్: పంజాగుట్ట పోలీసుల ముందుకు ఇవాళ(సోమవారం) మాజీ ఎమ్మెల్యే (Ex MLA) షకీల్ (Shakeel) కుమారుడు రహెల్ రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 16వ తేదీన పోలీసుల ముందు హాజరు అవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రజాభవన్ గేట్లు ఢీకొట్టాడని రహేల్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. యాక్సిడెంట్ తర్వాత రహెల్ దుబాయ్ పారిపోయాడు. ప్రస్తుతం దుబాయ్‌లో రహెల్ ఉన్నాడు. పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
కోర్టు బెయిల్ ..
కాగా.. రహిల్‌కు గతంలో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే రహిల్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు(TS Police) హైకోర్టును(High Court) ఆశ్రయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్‌లో 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసును కూడా రీ ఓపెన్ చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన అప్పటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. పంజాగుట్ట కేసు మాదిరిగానే.. జూబ్లీహిల్స్ కేసులోనూ రహిల్‌ను తప్పించారు అప్పటి పోలీసులు. తనకు బదులుగా వేరే వ్యక్తిని డ్రైవర్‌గా పంపించాడు రహిల్. ఇప్పటికే ఈ కేసులో చార్జిషీట్ సైతం దాఖలు చేశారు పోలీసులు. చార్జిషీట్లోనూ రహిల్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు తప్పించే ప్రయత్నం చేశారు.
జూబ్లీహిల్స్‌లో ప్రమాదం...
2022 మార్చిలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు నెలల చిన్నారి మృతి చెందాడు. ఓ మహిళ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను కారు ఢీకొట్టగా.. ఈ ప్రమాదంలో కాజోల్ రెండు నెలల కొడుకు రన్వీర్ మృతి చెందాడు. కాజోల్ తీవ్రంగా గాయపడింది. ప్రమాదం జరగిన వెంటనే కారులోని ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. కారుపై స్టిక్కర్ ఆధారంగా అది ఎమ్మెల్యే షకీల్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.
ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహెల్, స్నేహితులు ఆఫ్నాన్, మాజ్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే కారు ఎవరు నడిపారనే దానిపై పోలీసులు అనేక రకాలుగా దర్యాప్తు చేపట్టినప్పటికీ స్పష్టత రాలేదు. చివరకు కారు తానే నడిపానంటూ ఆఫ్నాన్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. దాంతో కేసులో ఆఫ్నాన్‌ను నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఛార్జ్‌షీట్‌ను కూడా జూబ్లీహిల్స్ పోలీసులు దాఖలు చేశారు. అయితే తాజాగా షకీల్ కొడుకు పాత్రపై అనుమానంతో మరోసారి దర్యాప్తు చేపట్టారు. అలాగే కేసును 304 పార్ట్ 2గా సెక్షన్లుగా మార్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజు రెండు కీలక బిల్లులు..
K Kavitha: ప్రభుత్వ జీవోను ధిక్కరించి..
Read Latest Telangana News and Telugu News