Hyderabad: ఓయో రూమ్‌లో గొడవ.. చివరికి యువకుడు ఏం చేశాడంటే..
ABN , Publish Date - Nov 11 , 2024 | 10:06 AM
హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన ఓంకార్ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. అతను, సౌమ్య అనే యువతి ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారిద్దరూ కలిసి రామంతపూర్ ప్రగతినగర్‌లో ఉన్న ర్లోని ఓయో రూమ్‌లో ఆదివారం రాత్రి అద్దెకు దిగారు.
హైదరాబాద్: రామంతపూర్‌లోని ఓ ఓయో హోటల్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. ప్రేమికుల మధ్య జరిగిన ఘర్షణతో ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన ఓంకార్ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. అతను, సౌమ్య అనే యువతి ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారిద్దరూ కలిసి రామంతపూర్ ప్రగతినగర్‌లో ఉన్న ర్లోని ఓయో రూమ్‌లో ఆదివారం రాత్రి అద్దెకు దిగారు. రాత్రంతా బాగానే ఉన్న ప్రేమజంట.. ఇవాళ తెల్లవారుజామున ఘర్షణకు దిగారు. విషయం ఏంటో తెలియదు కానీ గొడవ కారణంగా ప్రియుడు ఓంకార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో యువతి బాత్ రూమ్‌కి వెళ్లిన వెంటనే ఆత్మహత్యాయత్నం చేశాడు.
అలికిడి విడి బయటకు వచ్చిన యువతి ఫ్యాన్‌కు ప్రియుడు ఉరేసుకుని ఉండడాన్ని చూసి భయాందోళనకు గురైంది. వెంటనే ఓయో హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చింది. దీంతో అందరూ కలిసి యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే వారిద్దరికీ ఎందుకు గొడవ వచ్చింది, ఓంకార్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు వంటి విషయాలు తెలియరాలేదు. అయితే యువతిపైనా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Tiger: ఆ మూడు జిల్లాల ప్రజలను వణికిస్తున్న పెద్దపులి..
Ponnam Prabhakar: కేటీఆర్‌కు మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్