Share News

Cambodia Case: కంబోడియా సైబర్ నేరగాళ్ల కేసులో మరో నిందితుడు అరెస్టు..

ABN , Publish Date - Jul 13 , 2024 | 09:57 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కంబోడియా సైబర్ నేరగాళ్ల కేసులో కీలక నిందితుణ్ని సైబర్ సెక్యురిటీ పోలీసులు అరెస్టు చేశారు. చైనీయులతో చేతులు కలిపి భారతదేశానికి చెందిన నిరుద్యోగులను కంబోడియా పంపించడంలో కీలకంగా వ్యవహరిస్తు్న్న అబ్దుల్ అలాంను ఢిల్లీలో పట్టుకున్నారు.

Cambodia Case: కంబోడియా సైబర్ నేరగాళ్ల కేసులో మరో నిందితుడు అరెస్టు..

ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కంబోడియా సైబర్ నేరగాళ్ల కేసులో కీలక నిందితుణ్ని సైబర్ సెక్యురిటీ పోలీసులు అరెస్టు చేశారు. చైనీయులతో చేతులు కలిపి భారతదేశానికి చెందిన నిరుద్యోగులను కంబోడియా పంపించడంలో కీలకంగా వ్యవహరిస్తు్న్న అబ్దుల్ అలాంను ఢిల్లీలో పట్టుకున్నారు. కంబోడియాలో సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుని దేశానికి తిరిగివచ్చిన సిరిసిల్లకు చెందిన బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి స్థానిక ఏజెంట్ సాయి ప్రసాద్ సహా ఢిల్లీకి చెందిన అన్సారిని పోలీసులు అరెస్టు చేయగా.. తాజాగా మరో నిందితుడు అబ్దుల్ అలాంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


ముఠా సభ్యులంతా నిరుద్యోగులే లక్ష్యంగా నెలకు 1000 డాలర్ల వేతనం ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తూ వివిధ రాష్ట్రాలకు చెందిన 500నుంచి 600మందిని కంబోడియా తరలించారు. అనంతరం వారి పాస్‌పోర్టులు లాక్కొని సైబర్ నేరాలు చేయించేవారు. రోజుకు 16గంటలకు పైగా పని చేయిస్తూ.. నిరాకరించిన వారిని చిత్రహింసలకు గురి చేశారు. ఈ విధంగా సైబర్ నేరాల ద్వారా రూ.500కోట్ల దోపిడీ జరిగినట్లు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ, ఐ4సీ సమీక్షలో తేలింది. దీనిపై అప్రమత్తమైన భారత ప్రభుత్వం కొంతమందిని తిరిగి దేశానికి రప్పించింది. తాజాగా మరో నిందితుణ్ని అరెస్టు చేయడంతో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Jul 13 , 2024 | 09:58 PM