Share News

ACB DG: హైడ్రా పేరు చెప్పి లంచాలు వసూలు చేస్తే చర్యలు తప్పవు

ABN , Publish Date - Sep 04 , 2024 | 04:54 PM

Telangana: హైడ్రా పేరు చెప్పి లంచాలు వసూలు చేస్తే చర్యలు తప్పవన్న ఏసీబీ డీజీ హెచ్చరించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... హైడ్రా పేరుతో కొందరు ప్రైవేటు , ప్రభుత్వ అధికారులు పాత నోటీసులు ఇస్తున్నారన్నారు. ఫిర్యాదులను సాకుగా చూపి ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తుట్లు తమ నోటీసుకి వచ్చిందన్నారు.

ACB DG: హైడ్రా పేరు చెప్పి లంచాలు వసూలు చేస్తే చర్యలు తప్పవు
ACB DG

హైదరాబాద్, సెప్టెంబర్ 4: హైడ్రా (Hydra) పేరు చెప్పి లంచాలు వసూలు చేస్తే చర్యలు తప్పవన్న ఏసీబీ డీజీ హెచ్చరించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... హైడ్రా పేరుతో కొందరు ప్రైవేటు , ప్రభుత్వ అధికారులు పాత నోటీసులు ఇస్తున్నారన్నారు. ఫిర్యాదులను సాకుగా చూపి ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తుట్లు తమ నోటీసుకి వచ్చిందన్నారు. డబ్బులు డిమాండ్ చేసిన హైడ్రా పేరును చూపిస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయాలన్నారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలన్నారు. అటువంటి ఇన్‌ఫార్మర్ల పేర్లు గోప్యంగా, సురక్షితంగా ఉంచబడతాయని ఏసీబీ డీజీ పేర్కొన్నారు.

AP High Court: వైసీపీ నేతలకు బిగ్ షాక్.. హైకోర్టు కీలక తీర్పు..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్...

హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్‌సీఓఆర్ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పీని నిర్మిస్తున్న బిల్డర్‌కు హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తి పై బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి పిర్యాదు చేశారు. సోషల్ యాక్టివిస్ట్ , సోషల్ వర్కర్ అని బోర్డు పెట్టుకొని నిర్మాణం పనులు చూడడానికి వస్తున్న కస్టమర్లకు అసత్య ప్రచారం చేశాడు సదరు వ్యక్తి. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో దగ్గరి పరిచయం అని చెప్పి కలిసి దిగిన ఫోటోలు చూపి విప్లవ సిన్హా అనే వ్యక్తి వాట్స్అప్ కాల్ చేసి బెదిరింపులు పాల్పడుతున్నట్లు బిల్డర్లు తెలిపారు.

Vinayaka Chavithi Special 2024: పండగ రోజు విద్యార్థులు ఇలా చేస్తే మాత్రం వారికి తిరుగే ఉండదు..


పిస్తా హౌస్ వద్ద కలుద్దామని చెప్పి అక్కడికి పిలిచి హైడ్రా రంగనాథ్‌తో కలిసి దిగిన ఫోటోలు చూపిస్తూ, రంగనాథ్ తనకు బాగా దగ్గరని అమీన్పూర్‌లో ఎలాంటి విషయమైనా తననే అడుగుతారని బెదిరింపులకు పాల్పడ్డాడని బిల్డర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘మీ నిర్మాణం జోలికి రావద్దు అంటే తనకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. లేదంటే హైడ్రా నందు ఫిర్యాదు చేస్తా, ప్రతిరోజు వార్తా పత్రికల్లో మీ నిర్మాణం గురించి తప్పుగా రాయిస్తా’’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. బిల్డర్ల ఫిర్యాదుతో సదరు వ్యక్తిపై అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి...

Praveen: గురుకులాలను శిథిలం చేయాలని రేవంత్ సర్కార్ కుట్ర

TG Govt: వరద నష్టంపై టీ.సర్కార్‌కు కేంద్ర హోంశాఖ లేఖ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 04 , 2024 | 05:00 PM