Share News

Vijayawada floods: ఏపీకి ఎవరూ ఇవ్వనంత సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్

ABN , Publish Date - Sep 04 , 2024 | 03:52 PM

బాధితులను ఆదుకోవడమంటే మాటలు చెప్పడం కాదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిరూపించారు. ఏకంగా రూ.4 కోట్ల వరద సాయాన్ని ఆయన ప్రకటించారు. వరద ప్రభావిత గ్రామాలకు ఆయన ఈ విరాళం అందించారు. మొత్తం 400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడ్డాయని, ఒక్కో పంచాయతీకి ఒక లక్ష రూపాయల చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తానని ప్రకటించారు.

Vijayawada floods: ఏపీకి ఎవరూ ఇవ్వనంత సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan

అమరావతి: బాధితులను ఆదుకోవడమంటే మాటలు చెప్పడం కాదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిరూపించారు. ఏకంగా రూ.4 కోట్ల వరద సాయాన్ని ఆయన ప్రకటించారు. వరద ప్రభావిత గ్రామాలకు ఆయన ఈ విరాళం అందించారు. మొత్తం 400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడ్డాయని, ఒక్కో పంచాయతీకి ఒక లక్ష రూపాయల చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తానని ప్రకటించారు. రూ.4 కోట్లు మొత్తాన్ని ముంపు గ్రామ పంచాయతీలకు అందించాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు.


ఇక తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం అందించనున్నట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితులు, గ్రామాలలో తాగు నీరు, ఆహారం సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ఏలేరు ముంపు ప్రభావిత గ్రామాలను అప్రమత్తం చేయాలి: పవన్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం నేపథ్యంలో ఏలేరు జలాశయానికి వరద ముప్పు పొంచి ఉన్నందున ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ప్రజలకు నిత్యావసరాలు, ఆహారం, తాగు నీరు, ఔషధాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఆయన జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడారు.


ఏలేరుకి వచ్చిన వరద నీరు, ఈ రోజు సాయంత్రం నుంచి నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితులపై కలెక్టర్ వివరించారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఏలేరు రిజర్వాయర్‌కి 20.2 టీఎంసీల నీరు చేరుకుందని, క్రమంగా నీరు వదలాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇవాళ (బుధవారం) 500 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతామని, పిఠాపురం, పెద్దాపురం నియోజక వర్గాల వైపు నీరు మళ్లుందని చెప్పారు. ముంపు గ్రామాల ప్రజలకు అవసరమైన ఆహారం, తాగు నీరు, ఔషధాలు సిద్ధం చేసే విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

నేను బయటకొస్తే సహాయ చర్యలకు ఆటంకం: డిప్యూటీ సీఎం పవన్

బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి

Updated Date - Sep 04 , 2024 | 03:56 PM