Share News

ACB Raid: ఆదాయానికి మించి ఆస్తులు.. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ రైడ్

ABN , Publish Date - Jan 24 , 2024 | 01:39 PM

Telangana: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ACB Raid: ఆదాయానికి మించి ఆస్తులు.. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ రైడ్

హైదరాబాద్, జనవరి 24: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు (ACB Raids) కలకలం రేపుతున్నాయి. బుధవారం హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (HMDA Former Director Shiva Balakrishna) ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివ బాలకృష్ణపై ఆదాయం మించి ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది. ఈ క్రమంలో ఈరోజు ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు చేస్తోంది. శివ బాలకృష్ణ ఇళ్లు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. శివ బాలకృష్ణ తన పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో బాలకృష్ణ కీలక స్థానంలో పనిచేసిన విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 24 , 2024 | 01:39 PM