ACB: శివబాలకృష్ణ కేసులో ఐఏఎస్ అరవింద్‌ను ఏసీబీ విచారించబోతోందా?
ABN , Publish Date - Feb 19 , 2024 | 11:09 AM
Telangana: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. బాలకృష్ణ బినామీలను అధికారులు ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 19: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Former Director of HMDA Siva Balakrishna) కేసులో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. బాలకృష్ణ బినామీలను అధికారులు ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. బినామీలు డ్రైవర్ గోపి, అటెండర్ హాబీబ్, సత్యనారాయణమూర్తి, బాలకృష్ణ మేనల్లుడు భరత్ కుమార్.. ఏసీబీ విచారణకు సహకరిస్తున్నారు. శివబాలకృష్ణకు సంబంధించి భారీగా ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 2020 నుంచి 2023 వరకు బినామీలపై శివబాలకృష్ణ కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు రాబట్టారు.
అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు సీఆర్‌పీ 160 నోటీసులు ఇచ్చి ఏసీబీ అధికారులు విచారించబోతున్నట్లు తెలుస్తోంది. శివబాలకృష్ణ ఇచ్చిన సమాచారంతో ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు సంబంధించిన వివరాలను ఏసీబీ సేకరించింది. అరవింద్ కుమార్ ఆదేశాలతో అనుమతి ఇప్పించిన ఫైల్స్‌లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమతుల ఫైల్స్ క్లియర్‌తో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి అరవింద్ కుమార్ భారీగా లబ్ధి పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. అరవింద్ కుమార్ ఈ మధ్య కాలంలో కొనుగోలు చేసిన ఆస్తులపై ఏసీబీ ఆరా తీస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..