Share News

Viral Video: ఇది కదా బతుకమ్మ సంబరాల ఆనందం అంటే..

ABN , Publish Date - Oct 02 , 2024 | 02:19 PM

Bathukamma Festival 2024: తెలంగాణలో పూల పండుగ వచ్చేసింది. ఆడపడుచులంతా కలిసి తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేసి.. సంబరాలు చేసుకుంటున్నారు. అక్టోబర్ 2న తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఈ సంబరాలు మొదలవుతాయి. అయితే, రాష్ట్రంలో స్కూళ్లకు 2వ తేదీ నుంచే దసరా సెలవులు కావడంతో..

Viral Video: ఇది కదా బతుకమ్మ సంబరాల ఆనందం అంటే..
Bathukamma Festival 2024

Bathukamma Festival 2024: తెలంగాణలో పూల పండుగ వచ్చేసింది. ఆడపడుచులంతా కలిసి తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేసి.. సంబరాలు చేసుకుంటున్నారు. అక్టోబర్ 2న తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఈ సంబరాలు మొదలవుతాయి. అయితే, రాష్ట్రంలో స్కూళ్లకు 2వ తేదీ నుంచే దసరా సెలవులు కావడంతో.. ఆయా పాఠశాలల్లో ముందు రోజే బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థినులు బతుకమ్మలు తయారు చేసి పాఠశాల ఆవరణలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ ఆదర్శ పాఠశాలలో కూడా విద్యార్థులు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఒక రోజు ముందే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం హాజరయ్యారు. విద్యార్థినిలు బతుకమ్మ ఆడుతుండగా.. మంత్రముగ్దులయ్యారు ఎస్పీ. విద్యార్థినులతో కలిసి బతుకమ్మ పాఠలకు తాను సైతం కాలు కదిపారు. పాటకు అనువుగా విద్యార్థినిలతో కలిసి డ్యాన్స్ చేశారాయన. ఈ కార్యక్రమంలో మరికొందరు పోలీసు ఉన్నతాధికారులు సహా.. విద్యాశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.


బతుకమ్మ సంబరాల్లో ఎస్పీ పాల్గొన్న వీడియోను అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. బతుకమ్మ పాటకు విద్యార్థినులు, పోలీసు ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులంతా కలిసి డ్యాన్స్ చేయడం నెటిజన్లు ఆకర్షించింది. వీడియోను చూసి నెటిజన్లు.. బతుకమ్మ సంబరాలు చాలా ప్రత్యేకం అని.. ఆ పాటలు వింటే ఎవరైనా కాలు కదపాల్సిందేనంటూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


నేడు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు..

ప్రతీ సంవత్సరం భాద్రపద అమావాస్య నుంచి ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు అంటే తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లోని ఆడపడుచులంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్నా పెద్దా అంతా వేడుకలలో పాల్గొంటారు. ఈ ఏడాది బతుకమ్మ పండుగ అక్టోబర్ 2 నుంచి 10 తేదీ వరకు జరుపుకోనున్నారు. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలో భాగంగా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను తయారు చేస్తారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం సమర్పిస్తారు.


తొమ్మిదిరోజులు.. తొమ్మిది రకాల బతుకమ్మలు..

  • తొలిరోజు - ఎంగిలి పూల బతుకమ్మ

  • రెండో రోజు - అటుకుల బతుకమ్మ

  • మూడో రోజు - ముద్దపప్పు బతుకమ్మ

  • నాలుగో రోజు - నానే బియ్యం బతుకమ్మ

  • ఐదవ రోజు - అట్ల బతుకమ్మ

  • ఆరవ రోజు - అలిగిన బతుకమ్మ

  • ఏడవ రోజు - వేపకాయల బతుకమ్మ

  • ఎనిమిదవ రోజు - వెన్నముద్దల బతుకమ్మ

  • తొమ్మిదవ రోజు - సద్దుల బతుకమ్మ


Also Read:

నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం: మంత్రి

ఏపీలో చెత్త పన్నుపై సంచలన నిర్ణయం..

సినిమాల కరువులో.. టాలీవుడ్ భామలు

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 02 , 2024 | 02:19 PM