Share News

Hyderabad: హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Dec 13 , 2024 | 05:52 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన హైదరాబాద్‌కు చేరుకుని అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

Hyderabad: హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విషయం ఏంటంటే..

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన హైదరాబాద్‌కు చేరుకుని అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్‌ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు పవన్. మరోవైపు ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, నటుడు నాగబాబు.. బన్నీ ఇంటికి చేరుకుని పరామర్శించారు. అల్లు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కాగా, తాజాగా అల్లు అర్జున్ ఇంటికి పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్, హీరో దగ్గుబాటి రాణా చేరుకున్నారు.


మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు పోలీసులు అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించే ప్రయత్నం చేశారు. కాగా, అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదోపవాదనల నడుమ అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో మెగా, అల్లు కుటుంబాలు, ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


అల్లు అర్జున్‌కి రిమాండ్ విధించడంపై గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఆయన అభిమానులు నిరసనలకు పిలుపునిచ్చారు. యూసఫ్ గూడా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కూకట్ పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్‌లో ఆందోళనలకు పెద్దఎత్తున పిలుపునిచ్చారు. పుష్ప-2 సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే హైకోర్టులో ఐకాన్ స్టార్‌కు ఊరట లభించడంతో ఆందోళనలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Dec 13 , 2024 | 06:18 PM