Share News

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్..

ABN , Publish Date - Dec 09 , 2024 | 09:33 AM

డ్యాన్సర్ అసోసియేషన్ కార్డులు జారీ విషయంలో భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర జరిగిందని జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు.

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్..

హైదరాబాద్: ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ తగిలింది. జానీ మాస్టర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కోరియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. కోరియోగ్రాఫర్ అధ్యక్షులుగా జానీ మాస్టర్ (Choreographer Jani Master) ఉన్న విషయం తెలిసిందే. గుట్టు చప్పుడు కాకుండా కోరియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు అసోసియేషన్ సభ్యులు జానీ మాస్టర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.. అసోసియేషన్ నుంచి తొలగించినట్లు జానీ మాస్టర్‌‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని... తనను ఏ అసోసియేషన్ తొలగించలేదని జానీ మాస్టర్ చెబుతున్నారు. అసోసియేషన్ కోసం తీసుకున్న భూ వివాదంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. శంకర్ పల్లిలో డ్యాన్సర్ అసోసియేషన్ కోసం 9 ఎకరాలు భూమి కొనుగోలు చేశారని ఆరోపించారు. భూమి కొనుగోలు సమయంలో పలువురు కోట్ల రూపాయలు స్కామ్ చేశారని... స్కామ్ మొత్తం బయటకు తీస్తునందుకే తనపై ఆరోపణలు వచ్చాయని జానీ మాస్టర్‌ అంటున్నారు.


డ్యాన్సర్ అసోసియేషన్ కార్డుల జారీ విషయంలో భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర జరిగిందని జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా న్యాయస్థానల్లో ఎదుర్కొంటానని జానీ మాస్టర్ తెలిపారు. అయితే అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్ కొన్ని రోజుల క్రితం చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంచల్ గూడ జైలు నుంచి మాస్టర్ బయటకు వచ్చారు. 36 రోజులు పాటు ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు.


ఏం జరిగిందంటే...

2017లో ఓ కాంటెస్ట్‌లో పాల్గొనే అవకాశం వచ్చిన బాధితురాలు.. హైదరాబాద్‌కు వచ్చారు. 2019 నుంచి జానీ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ముంబైలో షూటింగ్‌ సమయంలో అక్కడ హోటల్‌ గదిలో తనపై జానీ మాస్టర్‌ లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఉద్యోగంలోంచి తీసేస్తానని, సినిమాల్లో ఎక్కడా పని దొరకకుండా చేస్తానని బెదిరించినట్లు తెలిపారు. దాంతో తాను మిన్నకుండిపోవడాన్ని అవకాశంగా తీసుకుని, తరచూ షూటింగ్‌ ప్రదేశాల్లో వేధించేవాడని.. వ్యానిటీ వ్యాన్‌లో తన కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టేవాడని వివరించారు. ఒప్పుకోకుంటే తన జుట్టు పట్టుకుని దాడి చేసేవాడని.. ఓ సందర్భంలో అద్దంతో నా ముఖంపై కొట్టాడని వాపోయారు. మాట వినకపోతే.. షూటింగ్‌ లొకేషన్‌లో అందరి ముందు అవమానపరిచేవాడని, అసభ్యంగా తాకేవాడని తెలిపారు. మతం మారి, తనను పెళ్లి చేసుకోవాలని హింసించేవాడని చెప్పారు.

janimaster.jpg


మతం మారాలని వేధించేవాడు

జానీ మాస్టర్‌ వేధింపులు పెరగడంతో.. తాను సొంతంగా పనిచేయడం ప్రారంభించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. దీంతో జానీ మాస్టర్‌ ఓ రోజు తన భార్యతో కలిసి ఇంటికి వచ్చినట్లు చెప్పారు. వారిద్దరూ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారని, జానీ మాస్టర్‌ భార్య తనపై చేయి చేసుకున్నారని వివరించారు. ఓ సారి రాత్రి ఇంటికి వచ్చి, తలుపు తట్టాడని, తాను స్పందించకపోవడంతో.. బయట పార్క్‌ చేసి ఉన్న తన స్కూటీని ధ్వంసం చేశాడని తెలిపారు. తాను షూటింగ్‌లో ఉన్న ప్రాంతానికి వచ్చి, గొడవపడేవాడని, పెళ్లి చేసుకుంటానని, మతం మారాలని అందరి ముందు వేధించేవాడని వెల్లడించారు. ‘‘ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నాపై దాడికి యత్నించారు. గుర్తుతెలియని పార్సిల్‌ పంపి భయభ్రాంతులకు గురిచేశారు. ఇండస్ట్రీలో నేను ఒప్పుకొన్న పనులను కూడా చేయకుండా జానీ మాస్టర్‌ వేధింపులకు గురిచేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోగలరు’’ అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


గోవాలో అదుపులోకి..

లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ తీసుకుని.. హైదరాబాద్‌ తీసుకువచ్చారు. జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి జీరో ఎఫ్‌ఐఆర్‌ కాగా, నార్సింగ్‌ పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారు.

Jani.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

పారిపోయిన టెన్తు విద్యార్థుల కథ సుఖాంతం

దందాల ద్వారంపూడి

తెలంగాణ తల్లి పండుగ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 09 , 2024 | 09:50 AM