TG Govt: స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్ర్రక్రియ వేగవంతం
ABN , Publish Date - Oct 26 , 2024 | 06:01 PM
స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం రేవంత్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి కంపెనీ ప్రతినిధుల బృందం చర్చలు జరిపారు.
హైదరాబాద్: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం మరో ముందడుగు పడింది. స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మేగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) ముందుకొచ్చింది. యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ.200 కోట్లను మేఘా కంపెనీ కేటాయించింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను మేఘా కంపెనీ స్వీకరించింది. ప్రపంచ స్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులతో స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టేందుకు మేఘా కంపెనీ ముందుకొచ్చింది.
ALSO READ: TG Politics: సీఎం రేవంత్ వైఖరితోనే కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్డు మీదకు.. సబిత ఇంద్రారెడ్డి ధ్వజం
సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి కంపెనీ ప్రతినిధుల బృందం చర్చలు జరిపారు. సీఎంతో పాటు చర్చల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ప్రభుత్వం తలపెట్టిన స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకునేందుకు మేఘా కంపెనీ నిర్వాహకులు చర్చలు జరిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణం చేపడుతామని మేఘా కంపెనీ ప్రకటించింంది. యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) మేఘా కంపెనీ చేసుకుంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. హైదరాబాద్ శివార్లలో కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. అధునాతన బోధన సదుపాయాలతో పాటు విద్యార్థులకు అన్ని వసతులుండేలా క్యాంపస్ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ ముందుకు వచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అకాడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్ నిర్మిస్తామని మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్‌లతో నిపుణులతో తయారు చేయించిన డిజైన్‌లపై చర్చించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నవంబర్ 8వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం రేవంత్‌రడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
Jaggareddy: ఎవ్వరినీ వదలా... మీడియాపై జగ్గారెడ్డి ఫైర్
Lawrence Bishnoi: జైల్లో గ్యాంగ్‌స్టర్ ఇంటర్వ్యూ.. డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులపై వేటు
TG Police: పోలీసు, పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారిన అజ్ఞాత వ్యక్తి లేఖ..
Read Latest Telangana News And Telugu News