Balka Suman: సీఎం రేవంత్, సోదరులపై విరుచుకుపడ్డ బాల్క సుమన్
ABN , Publish Date - Aug 07 , 2024 | 03:06 PM
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ తన సోదరులను తెలంగాణ మీదకు వదిలేశారని.. అతని సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్, ఆగస్టు 7: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Former MLA Balka suman) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ తన సోదరులను తెలంగాణ మీదకు వదిలేశారని.. అతని సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తూ అసెంబ్లీ కమిటీ హల్‌లో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదా లేకున్నా స్పీకర్ దగ్గర వికారాబాద్ రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. కొడంగల్‌లో తిరుపతి రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను పంచుతుంటే తమ జెడ్పిటీస్ మహిపాల్ అడ్డుకున్నారని తెలిపారు.
ఆస్పత్రి పాలైన రెజ్లర్ వినేశ్ ఫోగట్..|
రేవంత్ మరో సోదరుడు కొండల్ రెడ్డికి ఏ హోదా ఉందని అధికారులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారని ప్రశ్నించారు. రేవంత్ అమెరికా పర్యటనలో స్వచ్ బయోతో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని... ఆ కంపెనీ రేవంత్ మరో సోదరుడు ఎనుముల జగదీశ్ రెడ్డిది అని తెలిపారు. పదిహేను రోజుల క్రితమే ఆ కంపెనీ ఏర్పాటయ్యిందని అన్నారు.
Olympics 2024: వినేశ్‌పై అనర్హత వేటు.. స్పందించిన ప్రధాని మోదీ
ఇవే కాకుండా రేవంత్ సోదరుల ఆధ్వర్యంలో నాలుగు సంస్థలు ఏర్పాటు అయ్యాయన్నారు. ఈ సంస్థల ద్వారానే రేవంత్ బ్లాక్ మనీని వైట్‌గా మారుస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రధాన కంపెనిలే కాకుండా రేవంత్ సోదరులు అనేక మైక్రో సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారన్నారు. రేవంత్ సోదరులు రియల్టర్లను బెదిరించి విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
Rajasingh: చంద్రబాబు నాయుడు నాకు రాజకీయ గురువు
Peddi Sudarshan: రుణమాఫీపై వేల సంఖ్యలో కాల్స్, వాట్సప్ మెసేజెస్ వచ్చాయన్న మాజీ ఎమ్మెల్యే
Read Latest Telangana News And Telugu News