Share News

Balmoori Venkat: నిరుద్యోగులను మోసం చేయం.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం

ABN , Publish Date - Jul 18 , 2024 | 03:53 PM

నిరుద్యోగులు కోరుకునే విధంగా సానుకూలమైన ప్రకటన వచ్చే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (Balmoori Venkat) తెలిపారు. నిరుద్యోగులు చెప్పిన సమస్యలను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు.

Balmoori Venkat: నిరుద్యోగులను మోసం చేయం.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం
Balmoori Venkat

హైదరాబాద్: నిరుద్యోగులు కోరుకునే విధంగా సానుకూలమైన ప్రకటన వచ్చే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (Balmoori Venkat) తెలిపారు. నిరుద్యోగులు చెప్పిన సమస్యలను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. ముఖ్యంగా డీఎస్సీ -గ్రూప్ 2 పరీక్షకు మధ్య తక్కువ వ్యవధి ఉందని తెలిపారు. ఇది లూడా ఉదేశపూర్వకంగా ఇచ్చిన డేట్స్ కాదని చెప్పారు. గతంలో డీఎస్సీ పరీక్షలు మే -జూన్ నెలలో ఉండేవని అన్నారు.


ALSO Read: Telangana చిక్కుల్లో మరో ఐఏఎస్ అధికారి ఫ్రపుల్ దేశాయ్..!

బేగం పేట టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో ఈరోజు(గురువారం) ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, చరణ్ కౌశిక్, లోకేష్ యాదవ్ , బలలక్ష్మి, చెనగని దయాకర్, ఇతర ముఖ్యనాయకులు భేటీ అయ్యారు. నిరుద్యోగుల డిమాండ్లపై నేతలు చర్చించారు. నిరుద్యోగులు చెప్పిన సమస్యలు విన్నామని అన్నారు. అయితే అ రోజు యువకులు మరొకసారి డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించాలని కోరారని తెలిపారు.


ALSO Read: Indrakaran Reddy: 40 ఏళ్లలో ఎవ్వరూ ఇంత సాహసం చేయలేదు..

నిరుద్యోగుల కోరిక మేరకే అ రోజు టెట్ నిర్వహించామని తెలిపారు. అయితే అప్పటికే టీజీపీఎస్సీ పరీక్షలకు డేట్స్ ఇవ్వడంతో డీఎస్సీ -గ్రూప్ 2 పరీక్షలు వారం వ్యవధిలోనే వచ్చాయని వివరించారు. ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి..తాను ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి వారి సమస్యను విన్నామని సీఏం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గ్రూప్ 2 పరీక్షల పై ఇక సానుకూలమైన ప్రకటన వచ్చేలా చూస్తామని అన్నారు. ఇక మిగితా సమస్యలు కూడా నిరుద్యోగుల తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు.


రానున్న రోజుల్లో ఎలాంటి సమస్యలు రాకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి తో బీజేపీ నాయకులతో చర్చించి నిరుద్యోగులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. అసెంబ్లీలో అందరి ముందు కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధి చాటుకునే విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఉద్ఘాటించారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీ ని భర్తీ చేసి నిరుద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా నిరుద్యోగులను మోసం చేయమని.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని పేర్కొన్నారు.


ALSO Read: T.High Court: కుక్కల దాడి ఘటనపై హైకోర్టులో విచారణ

బీఆర్‌ఎస్‌ హయాంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిర్లక్ష్యానికి గురైందని.. ఆ ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలతో వివాదాలు కోర్టులకూ చేరాయని కాంగ్రెస్‌ నేతలు ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాల వల్ల పలు పరీక్షలు రద్దయ్యాయి. దీంతో.. నిరుద్యోగుల్లో అపనమ్మకం నెలకొంది.


ఈ నేపథ్యంలో రేవంత్‌ సర్కారు ఆ అపనమ్మకాన్ని పోగొట్టేలా చర్యలు తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. నిరుద్యోగుల్లో భరోసా కల్పించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు టీజీపీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి, కొత్త పాలక మండలిని నియమించింది.


ఇవి కూడా చదండి...

Tomato prices: ఠారెత్తిస్తున్న టమాటా!

High Court: బీఆర్‌ఎస్‌కు ఇచ్చిన 11 ఎకరాలు మావే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 18 , 2024 | 04:05 PM