Bandaru Dattatreya: తెలంగాణ సర్వోన్నతగా అభివృద్ధి చెందాలి
ABN , Publish Date - Nov 10 , 2024 | 02:24 PM
పసుపు రైతులకు కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు అండగా నిలవాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. జిల్లాలో అత్యధికంగా బీడీల తయారీపై ఆధారపడి మహిళలు జీవిస్తారని చెప్పారు. బీడీ కార్మికుల ఆర్థిక , ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు.
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రం సర్వోన్నతగా అభివృద్ధి చెందాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ఇవాళ(ఆదివారం) నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గంగా హారతికి వెళ్తూ మార్గం మధ్యలో డిచ్ పల్లిలో దత్తాత్రేయ ఆగారు. స్థానిక ఎంపీపీ నివాసంలో గవర్నర్ దత్తాత్రేయ అల్పాహారం చేశారు.
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... డిచ్‌పల్లితో 1970 నుంచి తనకు సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. పాత ఆత్మీయులను కలవడం సంతోషంగా ఉందని అన్నారు. పసుపు రైతులకు కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. జిల్లాలో అత్యధికంగా బీడీల తయారీపై ఆధారపడి మహిళలు జీవిస్తారని చెప్పారు. బీడీ కార్మికుల ఆర్థిక , ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు.