Home » Bandaru Dattatreya
Vidyasagar Rao: తాను రచయితను కాదు... తనకు రచనలు రావు అని మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తెలిపారు. తాను సంవత్సరం పాటు జైల్లో ఉండి రచనలు రాశానని గుర్తుచేసుకున్నారు.
పసుపు రైతులకు కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు అండగా నిలవాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. జిల్లాలో అత్యధికంగా బీడీల తయారీపై ఆధారపడి మహిళలు జీవిస్తారని చెప్పారు. బీడీ కార్మికుల ఆర్థిక , ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు.
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెనుప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ సీఐ బాల్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఢిల్లీ వెళ్లేందుకు దత్తాత్రేయ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కి ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కి ఓ వ్యక్తి అడ్డు రావడంతో ఈ సంఘటన జరిగింది.
తెలంగాణ రాష్ట్ర సాధనకు ‘అలయ్ బలయ్’ స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన ఆలస్యమవుతోందని భావించిన తరుణంలో రాజకీయ జేఏసీ ఆవిర్భవించిందని.. దాని ఏర్పాటుకు స్ఫూర్తి అలయ్ బలయ్ కార్యక్రమమేనని చెప్పారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమంలో అందరూ ఒక తాటికి వచ్చి కలిసి పని చేసేందుకు ఉపయోగపడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అలయ్ బలయ్ స్ఫూర్తితోనే తెలంగాణ జేఏసీ ఏర్పాటు అయిందని ఆయన గుర్తు చేశారు. అంతకుముందు రాజకీయ నాయకులు విడివిడిగా ఎవరికీ వారు కార్యక్రమాలు నిర్వహించుకునే వారని తెలిపారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 1 0 గంలకు ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, హర్యానా గవర్నర్లు, వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు. సినీ ప్రముఖులను కూడా అలయ్ బలయ్ కమిటీ అహ్వానించింది.
సమాజంలో అందరినీ సమైక్యంగా కలుపుకునేవే గణేష్ ఉత్సవాలని హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. కులం, మతం, భాషా. ప్రాంతం అనే తేడా చూడకుండా మనమంతా ఒక్కటే అనే భావన ఉంటుంది అని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao) ఇవాళ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ నానక్రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. గుండెకు స్టెంట్ వేసి, ఐసీయూలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిపట్ల భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపం తెలిపారు.
బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారంనాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని రామ్నగర్ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడకు వచ్చి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.