Share News

Bandla Ganesh:కేటీఆర్‌ను సీఎంని చేస్తామంటే 3 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావు..

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:26 PM

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్ ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రెచ్చిపోయారు. నేడు గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తండ్రి పేరు అడ్డు పెట్టుకునే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కేసీఆర్ కొడుకుగా తప్ప కేటీఆర్‌కి ఏ గుర్తింపూ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పోరాట యోధుడని.. బీఆర్ఎస్ పెట్టిన చిత్ర హింసలు, మానసిక క్షోభను అధిగమించి మరీ ముఖ్యమంత్రి అయ్యారని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

Bandla Ganesh:కేటీఆర్‌ను సీఎంని చేస్తామంటే 3 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావు..

హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఇవాళ బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రెచ్చిపోయారు. నేడు గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తండ్రి పేరు అడ్డు పెట్టుకునే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కేసీఆర్ (KCR) కొడుకుగా తప్ప కేటీఆర్‌కి ఏ గుర్తింపూ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పోరాట యోధుడని.. బీఆర్ఎస్ పెట్టిన చిత్ర హింసలు, మానసిక క్షోభను అధిగమించి మరీ ముఖ్యమంత్రి అయ్యారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుందన్నారు.

రేవంత్ సీఏం కావడంతో కేటీఆర్ భాధపడుతున్నాడన్నారు. కేటీఆర్ రాజకీయ పరంగా డిజాస్టర్ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. వందల యూ ట్యూబ్ ఛానెల్స్ పెట్టి రేవంత్‌‌ని తిట్టిస్తున్నారన్నారు. కేటీఆర్ కాల్ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులు పారిపోతున్నారన్నారు. మేం ఆరు గ్యారంటీలతో పాటు స్వేచ్ఛ అనే 7వ గ్యారెంటీ ఇచ్చామన్నారు. మీ హయాంలో ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే ఎన్‌కౌంటర్ చేయించే వాళ్లని.. రాళ్లతో కొట్టి చంపించే వాళ్లన్నారు. కేటీఆర్‌ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే 3 సీట్లు కూడా రాకపోయేవని బండ్ల గణేష్ అన్నారు. ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ అమెరికా వెళ్లారన్నారు. కేటీఆర్ హాయాంలో పని చేసిన ఆఫీసర్ల దగ్గర కోట్లాది రూపాయల నల్లధనం దొరుకుతోందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 01:26 PM