Home » Bandla Ganesh
Telangana Parliament Elections 2024: తెలంగాణ కాంగ్రెస్ (Congress) అభ్యర్థులను హైకమాండ్ దాదాపు ఖరారు చేసింది. తొలి జాబితాలో మొత్తం 9 మంది అభ్యర్థులను ప్రకటించాలని అగ్రనేతలు భావించినప్పటికీ.. 7 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ అభ్యర్థులు ఫిక్స్ అయినట్లేనని తెలుస్తోంది...
రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం సిగ్గు చేటు కాదా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు పవన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత బండ్ల గణేష్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఎన్నాళ్ళయిందని ప్రశ్నించారు.
ఏపీ మంత్రి రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజా డైమండ్ రాణి అని.. రేవంత్ ఫైటర్, జగన్ ఆక్సిడెంట్ సీఎం అని పేర్కొన్నారు. తండ్రి చనిపోతే సీఎం అయిన వ్యక్తులు ఉన్నారన్నారు. పులుసు వండి పెట్టావ్ కాబట్టి.. పులుసు రాణి మాత్రమే కాకుండా రోజా ఐటం రాణి అని పేర్కొన్నారు.
ప్రముఖ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్ ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రెచ్చిపోయారు. నేడు గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తండ్రి పేరు అడ్డు పెట్టుకునే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కేసీఆర్ కొడుకుగా తప్ప కేటీఆర్‌కి ఏ గుర్తింపూ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పోరాట యోధుడని.. బీఆర్ఎస్ పెట్టిన చిత్ర హింసలు, మానసిక క్షోభను అధిగమించి మరీ ముఖ్యమంత్రి అయ్యారని బండ్ల గణేష్ పేర్కొన్నారు.
దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచిన నగరంలోని మల్కాజిగిరి స్థానంపై అన్ని పార్టీల చూపు పడింది.
‘బండ్ల గణేశ్(Bandla Ganesh)కు నా ఇంటిని అద్దెకు ఇచ్చాను.. నా ఇంటిని చూసేందుకు వెళ్లగా ఆక్రమణ అంటూ కేసు పెట్టారు’ అని హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి నౌహీరాషేక్(MD Nauhirashek) ఆరోపించారు.
తమకు నిర్మాత బండ్ల గణేష్ నుంచి ప్రాణహాని ఉందని హీరా గోల్డ్ సంస్థల ఎండీ నౌహీరా షేక్ ఫిర్యాదు చేశారు. తమకు ఏమైనా అయితే, అందుకు బండ్ల గణేష్ బాధ్యత అని ఆమె కుండబద్దలు కొట్టారు. ఆయన తనపై దాడి చేశాడని, కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు చెప్పి తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు.
సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు ఒంగోలు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకు ఏడాది జైలుతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టుకి ఆయన నేడు హాజరయ్యారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మల్లారెడ్డికి మతిభ్రమించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నెలరోజుల పాలనపై నటుడు, సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్లగణేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని, గొప్పగా, అద్భుతంగా, ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఉందని కొనియాడారు.