Share News

Bhatti vikramarka: రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి.. భట్టివిక్రమార్క కీలక ఆదేశాలు

ABN , Publish Date - Aug 05 , 2024 | 09:06 PM

రైతు రుణమాఫీ మూలంగా బ్యాంకర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరిందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు. సోమవారం నాడు మధిరలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.

Bhatti vikramarka: రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి.. భట్టివిక్రమార్క కీలక ఆదేశాలు
Mallu Bhatti Vikramarka

ఖమ్మం జిల్లా: రైతు రుణమాఫీ మూలంగా బ్యాంకర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరిందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు. సోమవారం నాడు మధిరలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ... రైతులకు వెంటనే రుణాలు ఇవ్వాలని సూచించారు. బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో రికవరీ జరిగిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ కింద లక్షన్నర వరకు ఉన్న బకాయిలను ప్రభుత్వం జమ చేసిందని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.


ఇప్పటికే రూ.13 వేల కోట్ల నిధులను రైతు రుణమాఫీ కింద విడుదల చేశామని అన్నారు .రైతులను రుణ విముక్తులను చేసి వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు. సహకార బ్యాంకుల్లో రైతులు రుణమాఫీ విషయంలో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్, బ్యాంకు అధికారులను ఆదేశించారు. బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే అకౌంట్ ద్వారా సుమారు రూ.30 వేల కోట్ల జమ అయ్యాయని చెప్పారు. ఏకకాలంలో, ఒకే అకౌంట్ నుంచి ఇంత మొత్తం ఎన్నడు బ్యాంకుల్లో జమ కాలేదని అన్నారు. రైతులకు సహకరించాలని బ్యాంకు అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Aug 05 , 2024 | 09:51 PM