BJP: ఎన్నికల కోసమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కొత్త నాటకాలకు తెర..
ABN , Publish Date - Feb 13 , 2024 | 11:45 AM
Telangana: అధికారంలో ఉండి ఏం చేస్తామో కాంగ్రెస్ పార్టీ చెప్పలేక పోతుందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ఎన్నికల కోసమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కొత్త నాటకాలకు తెర లేపాయన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 13: అధికారంలో ఉండి ఏం చేస్తామో కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతుందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (BJP MLA Payal Shankar) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ఎన్నికల కోసమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కొత్త నాటకాలకు తెర లేపాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) కుంగిపోయిన విషయం తెలుసుకొని గత ఏడాది అక్టోబర్ 22న తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) పరిశీలించారన్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదు చేశామని.. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అప్పటి ప్రభుత్వం కనీసం సమాధానాలు చెప్పలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసి రావడం వల్ల ఒరిగేది ఏమీ లేదన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని ఎమ్మెల్యే శంకర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పిక్నిక్ వెళ్తున్నారు: పాల్వాయి హరీష్
మెడిగడ్డకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పిక్నిక్‌గా వెళ్తున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ (MLA Palvai Harish) విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని అందరికీ తెలుసని.. ఇప్పుడు వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. మార్పు అనేది గ్రౌండ్‌లో ఏమి లేదన్నారు. అప్పుడు బీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగం చేశారని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మండిపడ్డారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రివిలేజ్ లేదని.. ప్రోటోకాల్ లేదన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ టూర్‌ను బహిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని పాల్వాయి హరీష్ డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...