Share News

Politics: నేడు చలో ఎమ్మెల్యే గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపు

ABN , Publish Date - Sep 13 , 2024 | 08:01 AM

హైదరాబాద్: ఎమ్మెల్యేలు అరెకపూడి, కౌశిక్‌ రెడ్డిల మధ్య జెండా జగడం రాజుకుంది. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గాంధీ ఇంటికెళ్లి బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తానన్న కౌశిక్‌.. ఆయన విల్లాకు వెళ్లిన గాంధీ, ఆయన అనుచరులు.. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపిచ్చింది.

Politics: నేడు చలో ఎమ్మెల్యే గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపు

హైదరాబాద్: ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ (Arekapudi Gandhi), కౌశిక్‌ రెడ్డిల (Kaushik Reddy) మధ్య జెండా జగడం రాజుకుంది. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గాంధీ ఇంటికెళ్లి బీఆర్‌ఎస్‌ జెండా (BRS flag) ఎగరేస్తానన్న కౌశిక్‌.. ఆయన విల్లాకు వెళ్లిన గాంధీ, ఆయన అనుచరులు.. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపిచ్చింది. చలో గాంధీ నివాసానికి రావాలని పార్టీ నేతలకు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం 11గంటలకు మల్లంపేటలోని శంభిపూర్ రాజు నివాసం నుంచి భారీ ర్యాలీగా గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నేతలు బయలుదేరనున్నారు. పీఏసీ చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా గాంధీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలుపడంతో పాటు ఆయన నివాసంలో మేడ్చల్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు శంబిపూర్ రాజు ప్రకటించారు. ఈ సమావేశానికి హాజరుకావాలని మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పాడి కౌశిక్ రెడ్డి హాజరుకానున్నారు. గాంధీ బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెబుతున్నందున తాను కూడా వెళ్లి కండువా కప్పి శుభాకాంక్షలు చెబుతానని కౌశిక్ రెడ్డి అన్నారు.


ఈ వార్త కూడా చదవండి..

రచ్చ.. రచ్చ!

వందలాదిమందితో గాంధీ ఇంటి ముట్టడి..

కాగా చర్యకు తప్పకుండా ప్రతి చర్య ఉంటుందని, శుక్రవారం ఉదయం 11 గంటలకు వందలాది మందితో గాంధీ ఇంటిని ముట్టడించి తీరతామని, తెలంగాణ పౌరుషాన్ని చూపిస్తామని కౌశిక్‌ రెడ్డి ప్రకటించారు. ‘‘గాంధీని సాదరంగా ఆహ్వానించి, ఇంట్లోకి తీసుకెళ్లి భోజనం పెడదామని భావించాను. ఆయన రౌడీ షీటర్లతో దాడికి పాల్పడ్డాడు. నన్ను హత్య చేయాలని చూశారు. అయినా, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అసలు తెలంగాణలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా!?’’ అని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ ఇవ్వకుంటే.. ఇక సాధారణ ప్రజలకు ఏం ఇస్తారని నిలదీశారు. గాంధీపై పరుష పదజాలంతో దూషించారు. ఆయన టీడీపీని మోసం చేసి బీఆర్‌ఎ్‌సలో.. ఆ పార్టీని మోసం చేసి కాంగ్రెస్‌లో చేరారని, ఇప్పుడు పీఎసీ చైర్మన్‌ కాగానే బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. గాంధీ చరిత్ర నీచమైనదని విమర్శించారు.


‘‘గాంధీగారూ.. నేను వయసులో ఉన్నా. యువకుడిని.. నేను రెచ్చిపోతే ఎలా ఉంటుందో చూస్కో.. నాకు 39, నీకు 65.. లేదు.. తన్నుకుందాం అంటే ఐయామ్‌ రెడీ! దమ్ముంటే చూసుకుందాం రా’’ అని సవాల్‌ విసిరారు. కోట్లకు అమ్ముడుపోయారని, భూ సెటిల్‌మెంట్ల కోసమే కాంగ్రెస్‌ గూటికి వెళ్లారని ఆరోపించారు. ధైర్యముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని, ఎవరి సత్తా ఏమిటో తెలిసిపోతుందని సవాల్‌ చేశారు. ‘‘శుక్రవారం ఉదయం శంభీపూర్‌ రాజు ఇంటి నుంచి గ్రేటర్‌లోని ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో గాంధీ ఇంటికి వెళ్తాం. బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని ఆయన అంటున్నందుకే వెళుతున్నాం. అక్కడే బ్రేక్‌ఫాస్ట్‌.. లంచ్‌ చేస్తాం.. అక్కడి నుంచి గాంధీని తెలంగాణ భవన్‌కు, కేసీఆర్‌ దగ్గరకు తీసుకెళ్తాం’’ అని కౌశిక్ రెడ్డి వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వరద నీటి పంపింగ్ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ..

ఆదిమూలం ఇంట్లోకి నో ఎంట్రీ!

రాలిపోయిన అరుణతార

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 13 , 2024 | 08:07 AM