TS Assembly: బీఏసీకి హరీష్‌రావు.. ససేమిరా అన్న మంత్రి శ్రీధర్.. ఎందుకంటే?
ABN , Publish Date - Feb 08 , 2024 | 02:13 PM
Telangana: బీఏసీలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుకు అవమానం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరుగుతున్న బీఏసీ మీటింగ్‌కు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు బదులుగా హరీష్‌రావు హాజరయ్యారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: బీఏసీలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుకు (Former Minister Harish Rao) అవమానం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరుగుతున్న బీఏసీ మీటింగ్‌కు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు (BRS Chief KCR) బదులుగా హరీష్‌రావు హాజరయ్యారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఏసీలో మెంబర్ కాకుండా హరీష్ హాజరుకావడంపై అభ్యంతరం తెలిపారు. స్పీకర్ అనుమతితో కేసీఆర్ స్థానంలో హాజరైనట్లు హరీష్‌రావు చెప్పారు. అయినప్పటికీ అలా కుదరదని మంత్రి శ్రీధర్ బాబు తేల్చిచెప్పేశారు. దీంతో చేసేదేమీ లేక బీఏసీ సమావేశం మధ్యలో నుంచి హరీష్‌రావు బయటకు వచ్చేశారు.
బీఏసీ మీటింగ్...
కాగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరుగుతున్న బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హాజరయ్యారు. అలాగే బీఆర్‌ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి బలాల, సీపీఐ ఎమ్మేల్యే కూనంనేని సాంబశివ రావు హాజరయ్యారు. అసెంబ్లీ పనిదినాలు, ఎజెండాపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..