KP Vivekananda: సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయి
ABN , Publish Date - Jul 15 , 2024 | 03:16 PM
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ...హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారన్నారు. హైడ్రా ఏర్పాటును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందన్నారు.
హైదరాబాద్, జూలై 15: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద (MLA KP Vivekananda) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ...హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారన్నారు. హైడ్రా ఏర్పాటును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందన్నారు. స్థానిక సంస్థల స్ఫూర్తికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Pawan: ముంబైలోని ఓ పెళ్లిలో జనసేన గెలుపైనే చర్చ
శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూకబ్జాలు, అవినీతి చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. శివారు ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. గ్రేటర్ పరిధిలో పారిశుద్ధ్యం లోపించిందని.. విష జ్వరాలు విజృంభిస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో హైదరాబాద్‌కు ఒక్క కంపెనీ రాలేదన్నారు. రేవంత్ రెడ్డి మారువేషంలో ప్రజల వద్దకు వెళ్ళి వాస్తవాలు తెలుసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద హితవుపలికారు.
ఇవి కూడా చదవండి...
Tourists: వికారాబాద్‌లో టూరిస్టులకు వింత కష్టాలు!
Viral: వీడసలు మనిషేనా!? రైలు బయలుదేరగానే డోర్ పక్కన రాడ్ పట్టుకుని..
Read Latest Telangana News And Telugu News