BRS: ఆ ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమన్నారు.. ఇప్పుడు ఎవరిని కొట్టాలి రేవంత్?
ABN , Publish Date - Apr 11 , 2024 | 01:50 PM
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని... ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. పార్టీ మారిన కడియం, తెల్లం వెంకట్ రావుపై అనర్హత పిటిషన్ ఇవ్వడానికి కలిసే అవకాశం ఇవ్వడం లేదని వెల్లడించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 11: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ (MLA Vivekananda Goud) విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని... ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. పార్టీ మారిన కడియం, తెల్లం వెంకట్ రావుపై అనర్హత పిటిషన్ ఇవ్వడానికి కలిసే అవకాశం ఇవ్వడం లేదని వెల్లడించారు. పోస్టల్ ద్వారా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు పిటిషన్ పంపుతున్నామని చెప్పారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మూడు మాసాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్నారు.
Komatireddy Venkatareddy: రేవంత్ సీఎం పదవిపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
అనర్హత వేటు వేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో దీక్షలు చేస్తామని.. వారి ఇళ్ల ముందు నిరసన తెలుపుతామని అన్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి మాట తప్పారని.. మరి ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలని ప్రశ్నించారు. మారిన ఎమ్మెల్యేలను కొట్టాలా? లేకపోతే... చేర్చుకుంటున్న రేవంత్‌ను రాళ్లతో కొట్టాలా? అని నిలదీశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకుని కాంగ్రెస్ (Congress) ఫిరాయింపుల తీర్మానం పెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కన్ఫ్యూజన్ పార్టీ అంటూ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి...
Rains: సమయానికి ముందే వచ్చేస్తున్నాయ్.. భారీ వర్షాలు కురిపించేస్తాయ్..
Chandrababu: ముస్లింలకు జగన్‌రెడ్డి చేసింది ఏమిటి?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..