Share News

KTR: అప్పుడు కరెంట్ పోతే వార్త.. ఇప్పుడు కరెంట్ ఉంటే వార్త

ABN , Publish Date - Aug 15 , 2024 | 04:01 PM

Telangana: స్టేషన్ ఘనపూర్‌కు త్వరలోనే ఉప ఎన్నిక వస్తుందని... రాజయ్య గెలువడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దానం, కడియం, తెల్లంపై హై కోర్టుకు వెళ్ళామని.. మిగతా వారిపై కూడా సుప్రీంకోర్టుకు వెళతామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామన్నారు. 14 స్థానాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామని చెప్పుకొచ్చారు.

KTR: అప్పుడు కరెంట్ పోతే వార్త.. ఇప్పుడు కరెంట్ ఉంటే వార్త
BRS Working President KTR

హైదరాబాద్, ఆగస్టు 15: స్టేషన్ ఘనపూర్‌కు త్వరలోనే ఉప ఎన్నిక వస్తుందని... రాజయ్య గెలువడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దానం, కడియం, తెల్లంపై హైకోర్టుకు వెళ్ళామని.. మిగతా వారిపై కూడా సుప్రీంకోర్టుకు వెళతామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామన్నారు. 14 స్థానాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామని చెప్పుకొచ్చారు. బాధపడాల్సిన, భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. కాంగ్రెస్ 8 నెలల పాలనలో కరెంట్ మాయమైందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో కరెంట్ పోతే వార్త, రేవంత్ పాలనలో కరెంట్ ఉంటే వార్తగా మారిపోయిందన్నారు.

Chandrababu: అన్నా క్యాంటీన్ శాశ్వతంగా కొనసాగించాలి.. ఇదే నా ఆకాంక్ష


ఊసరవెల్లులు పాలన చేస్తే తొండలు, బల్లులతో కరెంట్ పోతుందన్నారు. నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ యువతకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోందన్నారు. జాబ్ లెస్ కేలండర్ విడుదల చేశారని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం రైతు బంధు ఎత్తకొట్టి రుణ మాఫీ అని బిల్డప్ ఇచ్చారన్నారు. ఆగస్టు 15 వచ్చినా రెండు లక్షల రుణమాఫీ కాలేదని.. అందుకే రాహుల్ గాంధీ రమ్మన్నా రావడం లేదన్నారు. రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు తులం ఇనుము కూడా ఇవ్వరన్నారు. ఆసరా పెన్షన్ 4వేలు పెంచుతామని అన్నారు... ఏమైంది అని నిలదీశారు. మా మీద కుటుంబ పాలన అని విమర్శలు చేశారని... ఇవ్వాల రేవంత్ సోదరులే అంతటా కనిపిస్తున్నారని తెలిపారు.


420 హామీలు నెరవేర్చాలని.. లేదంటే ఎండగడతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి కంపెనీకి 1000 కోట్ల టెండర్ ఇచ్చారని అన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ సన్నాసి మాటలు మాట్లాడిండని.. ఇలా మాట్లాడితే ఎవరైనా నమ్ముతారా? అని అడిగారు. 2019లోనే కాగ్నిజెంట్ ఒప్పందం చేసుకుందన్నారు. మాయ మాటలు, స్టంట్లతో ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు నడుపలేరన్నారు. కడియం కావ్య, శ్రీహరిని ప్రజలు త్వరలోనే నిలదీస్తారన్నారు.

Varalakshmi Vratam: వరాలు కురిపించే వరమహాలక్ష్మి పూజకు కావాల్సిన పూజ సామాగ్రి ఇదే..!


అప్పులపై కేటీఆర్

‘‘2014లో మీరు మాకు రాష్ట్రాన్ని అప్పజెప్పిన నాటికి తెలంగాణ రూ.300 కోట్ల రెవెన్యూ మిగులు రాష్ట్రం. 2023లో మేము మీకు రాష్ట్రాన్ని అప్పగించే నాటికి రూ.5900కోట్లు రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉంది. అప్పులు చేస్తే రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఎలా ఉంది. బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకోవడానికి మాకేం ఖర్మ. మాకు ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడ బిడ్డ ఇన్ని రోజులు జైల్‌లో ఉంటుందా? ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ వీపు చింతపండు అవుతుంది. త్వరలోనే అన్ని నియోజక వర్గాల్లో శిక్షణ తరగతులు పెడతాం. కేసీఆర్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్ట్‌ను ఇవ్వాళ రేవంత్ తాను పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఈ స్టెంట్లతో ప్రజలను మోసం చేయలేరు. మోసం చేయడం కాంగ్రెస్ నైజం. బీసీ రిజర్వేషన్ పెంచకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతారు’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Kotha Prabhakar: దుబ్బాక అభివృద్ధిపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

Alok Arade: తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై టీ.హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 15 , 2024 | 04:24 PM