KTR: శేరిలింగంపల్లి నియోజకవర్గంపై కేటీఆర్ హాట్ కామెంట్స్
ABN , Publish Date - Sep 24 , 2024 | 02:27 PM
Telangana: శేరిలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పక్కా అంటూ మాజీ మంత్రి హాట్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24: అరికెపూడి గాంధీ పార్టీ మారిన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS working President KTR) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పక్కా అంటూ మాజీ మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా సంగతి దేవుడెరుగు.. ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేదని విమర్శలు గుప్పించారు.
AP Govt: ఏపీ మహిళా కమిషన్‌ను వెంటనే తొలగించండి.. ప్రభుత్వం ఆదేశాలు
హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు సీట్లు రాలేదని పేదలపై సీఎం రేవంత్ పగ బట్టారని.. అందులో భాగంగానే రేవంత్ పేదల ఇళ్ళు కూల్చుతున్నారంటూ మండిపడ్డారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కట్టిందే కాంగ్రెస్ హయాంలో అని తెలిపారు. ఎన్ కన్వెన్షన్‌కు తాము నోటిలిచ్చామని.. నాగార్జున హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు. దుర్గం చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని ఎందుకు కూలగొట్టడం లేదని ప్రశ్నించారు. తిరుపతి రెడ్డికి ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయమా అంటూ నిలదీశారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి టాక్స్ నడుస్తోందన్నారు. రేవంత్ రెడ్డి చిట్టినాయుడు అయితే.. ఆయనకు ఏడుగురు సోదరులు ఉన్నారన్నారు.
పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి సహా.. కాంగ్రెస్ నేతల ఫాంహౌస్‌లు ఎందుకు కూల్చరని నిలదీశారు. హైడ్రాతో గూడు కోల్పోయిన పేదలకు 40 వేల డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైడ్రాకు చట్టం లేదని.. చుట్టరికం మాత్రమే ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం, నల్గొండ నేతలతో ముఖ్యమంత్రి కుర్చీకే ప్రమాదముందన్నారు. ‘‘పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. మా వాళ్ళేనని సీఎం ధైర్యంగా చెప్పగలడా? బీఆర్ఎస్‌ను వీడిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండ్ అయింది. డైవర్షన్ పాలిటిక్స్‌తో ఎక్కువ కాలం రాజకీయాలు నడువవు. మోసం చేసి బీఆర్ఎస్‌ను వీడిన ఎమ్మెల్యేల సంగతి ప్రజల్లోనే తేల్చుకుంటాం’’ అని తేల్చిచెప్పారు.
HYDRA: బ్యాంకు లోన్లపై హైడ్రా సంచలన నిర్ణయం
ఫిరాయింపులపై మంత్రి శ్రీధర్ బాబు అతితెలివిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కండువా కప్పిన సన్యాసి వెధవ ఎవడో శ్రీధర్ బాబుకు తెల్వదా... బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ళకు పోయి కాళ్ళు మొక్కిన వెధవ సన్యాసి ఎవడు.. రైతులను, వృద్దులను, నిరుద్యోగులను మోసం చేసిన ఘనుడు రేవంత్. రుణమాఫీపై సీఎం తప్పించుకుంటున్నారు’’ అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
Pawan: దుర్గగుడికి పవన్.. మెట్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం
RK Roja:ఇజ్జత్ పాయె.. రోజాకు దిమ్మతిరిగే పంచ్
Read Latest Telangana News And Telugu News