KTR: ఎక్కడా లేని అరుదైన వారసత్వం మన బతుకమ్మ
ABN , Publish Date - Oct 10 , 2024 | 11:56 AM
Telangana: సద్దుల బతుకమ్మ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. తొలిరోజు ఎంగిపూల బతుకమ్మను పురస్కరించుకుని తెలంగాణ ఆడపడుచులకు శుభాకాక్షంలు తెలిపిన కేటీఆర్.. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఎక్స్ వేదికగా విషెష్ తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణలో బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. ఎనిమిది రోజుల పాటు ఒక్కో పేరుతో బతుకమ్మను పేర్చి ఆడిపాడిన ఆడపడుచులు ఈరోజు సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈరోజుతో తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి. సద్దుల బతుకమ్మ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) శుభాకాంక్షలు తెలియజేశారు. తొలిరోజు ఎంగిపూల బతుకమ్మను పురస్కరించుకుని తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్.. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఎక్స్ వేదికగా విషెష్ తెలిపారు.
KTR: మూసీ పేరిట లక్ష కోట్ల దోపిడీకి యత్నం
కేటీఆర్ పోస్ట్...
తెలంగాణ సంస్కృతికి ప్రతీక మన బతుకమ్మ పండుగని కేటీఆర్ అన్నారు. పూలను, ప్రకృతిని దేవుళ్లుగా కొలుస్తూ ఆడ బిడ్డలు ఆనందంగా జరుపుకునే అద్భుమైన పండుగన్నారు. దేశంలోనే ఎక్కడ లేని అరుదైన, అందమైన సంస్కృతి వారసత్వం మన బతుకమ్మ పండగ అని గుర్తుచేసుకున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆడ బిడ్డలంతా ఎంతో సంతోషంగా ఈ ఘనమైన పండుగను జరుపుకుంటారన్నారు. ఆడబిడ్డల జీవితాల్లో బతుకమ్మ తల్లి మరిన్ని సంతోషాలు, వెలుగు నింపాలని కోరుకుంటున్నాని తెలుపుతూ ఆడబిడ్డలందరికీ కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
Bathukamma: తొమ్మిదివ రోజు సద్దుల బతుకమ్మ.. ఏమేమి చేస్తారో తెలుసా
తెలంగాణ ముస్తాబు...
మరోవైపు బతుకమ్మ సంబరాలకు తెలంగాణ రాష్ట్రం ముస్తాబైంది. పల్లెల్లో, పట్టణాల్లో మహిళలు బతుకమ్మ సంబరాలు జరుపుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ సంబరాల కోసం అంతా సిద్ధం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు అక్కడకు చేరుకుని బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. ఈ క్రమంలో ట్యాంక్ బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు జరిగాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్‌పై లేజర్, క్రాకర్స్ షోను నిర్వహించనున్నారు. దాదాపు10 వేల మంది మహిళలతో భారీ ర్యాలీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమర జ్యోతి స్థూపం నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు బతుకమ్మలతో ర్యాలీ చేయనున్నారు మహిళలు. అయితే సీఎం సహా ప్రముఖులు బతుకమ్మ వేడుకలకు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
CM Chandrababu: ప్రత్యేక విమానంలో ముంబైకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
Read Latest Telangana News And Telugu News