KTR: పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం... కానీ తలవంచం..!!
ABN , Publish Date - Aug 07 , 2024 | 03:51 PM
Telangana: బీఆర్‌ఎస్ పార్టీ పొత్తు, విలీనంపై గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఎక్స్(ట్విట్టర్) వేదికగా కీలక పోస్ట్ పెట్టారు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీపైన, విలీనం లాంటి దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలని.. లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్, ఆగస్టు 7: బీఆర్‌ఎస్ పార్టీ పొత్తు, విలీనంపై గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కీలక పోస్ట్ పెట్టారు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీపైన, విలీనం లాంటి దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలని.. లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ తమది అని అన్నారు.
AP Politics: విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. బీజేపీ ఎమ్మెల్యేను కలిసిన వైసీపీ కార్పొరేటర్లు
ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పుకొచ్చారు. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రప్రదాన నిలిపామన్నారు. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైందని అన్నారు.
Paris Olympics: ఆసుపత్రిలో చేరిన వినేష్ ఫోగట్..
ఎప్పటిలానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది.. పోరాడుతుంది అని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను దుష్ప్రచారాలని మానుకోవాలన్నారు. ‘‘పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం... కానీ తలవంచం.. ఎన్నటికైనా ఎప్పటికైనా’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
Peddi Sudarshan: రుణమాఫీపై వేల సంఖ్యలో కాల్స్, వాట్సప్ మెసేజెస్ వచ్చాయన్న మాజీ ఎమ్మెల్యే
Balka Suman: సీఎం రేవంత్, సోదరులపై విరుచుకుపడ్డ బాల్క సుమన్
Read Latest Telangana News And Telugu News