Share News

TG Govt: వరద నష్టంపై టీ.సర్కార్‌కు కేంద్ర హోంశాఖ లేఖ

ABN , Publish Date - Sep 04 , 2024 | 04:01 PM

Telangana: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. తెలంగాణలో వరద నష్టం వివరాలు నిర్ణీత ఫార్మాట్లో తక్షణమే పంపాలని కేంద్ర హోమ్ శాఖ సూచించింది. 1345 కోట్ల రూపాయల ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.

TG Govt: వరద నష్టంపై టీ.సర్కార్‌కు కేంద్ర హోంశాఖ లేఖ
Central Home Ministry

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. తెలంగాణలో వరద నష్టం వివరాలు నిర్ణీత ఫార్మాట్లో తక్షణమే పంపాలని కేంద్ర హోమ్ శాఖ సూచించింది. 1345 కోట్ల రూపాయల ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం (Telangana) వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. వరదల్లో సాయం చేసినందుకు ఇప్పటికే 12 ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు, రెండు హెలికాప్టర్లు పంపించినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

PM Modi: సింగపూర్‌లో ఎన్ఆర్ఐలను ఉత్సాహపరుస్తూ మోదీ ఏం చేశారంటే..?


ఎస్డీఆర్ఎఫ్ నిధికి కేంద్రం వాటా నిధుల విడుదలకు తక్షణమే వివరాలు పంపాలని కేంద్రం ఆదేశించింది. జూన్‌లో 208 కోట్ల రూపాయల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని ఈ సందర్భంగా కేంద్రం తెలిపింది. ఇది వరకు ఖర్చు చేసిన వాటి యుటీలైజేషన్ సర్టిఫికెట్స్, వరద నష్టం వివరాలు పంపాలని కోరింది. వరద నష్టం వివరాలను ఎప్పటికప్పుడు రోజువారిగా పంపాలని తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ కోరింది.


ఇవి కూడా చదవండి...

Vemula Veeresham: ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదు.

Praveen: గురుకులాలను శిథిలం చేయాలని రేవంత్ సర్కార్ కుట్ర

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 04 , 2024 | 04:07 PM