Share News

TG NEWS: చెన్నమనేని రమేష్‌ పౌరసత్వం వివాదంపై హైకోర్టులో విచారణ

ABN , Publish Date - Oct 22 , 2024 | 05:16 PM

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గత సంవత్సర కాలంలో చెన్నమనేని ప్రయాణాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

TG NEWS: చెన్నమనేని రమేష్‌ పౌరసత్వం వివాదంపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ(మంగళవారం) విచారణ జరిగింది. ఈరోజు తీర్పు నేపథ్యంలో మరికొన్ని అంశాలను న్యాయమూర్తి. ప్రస్థావించారు. ఇన్ని రోజులు చెన్నమనేని రమేష్ ఏ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. జర్మనీ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేశారని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికి జర్మనీ పాస్ పోర్ట్ ఉందని న్యాయవాది తెలిపారు. పాస్ పోర్ట్ ప్రామాణికం కాదని చెన్నమనేని తరపు న్యాయవాది తెలిపారు. ఇండియన్ పాస్ పోర్ట్ ఉందా అని న్యాయస్థానం ప్రశ్నించింది. లేదని కోర్టుకు తెలిపారు. చెన్నమనేని తరపు న్యాయవాది.. అన్ని వాదనలు పరిగణనలోకి తీసుకున్నామని హైకోర్టు తెలిపింది. తుది తీర్పు ప్రకటిస్తామని హైకోర్టు చెప్పింది. ఈరోజు హైకోర్టు తీర్పు వాయిదా వేసింది.


2009లో రాజకీయాల్లోకి వచ్చిన చెన్నమేని రమేష్‌బాబు..

కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజకీయాల్లో చెన్నమనేని కుటుంబాలు లేకుండా చూడలేము. వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం నాగారం నుంచి మొదలైన చెన్నమనేనిల రాజకీయ ప్రస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగింది. రాజేశ్వర్‌రావు వారసుడిగా 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన చెన్నమేని రమేష్‌బాబు వరుసగా ఎన్నిక ల్లో గెలుస్తూ వస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలోనూ చురుకుగా రమేష్‌బాబు ఉన్నారు. 2009లో సార్వత్రిక ఎన్నికల్లో వేములవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా రమేష్‌బాబు పోటీ చేయగా ప్రత్యర్థిగా అది శ్రీనివాస్‌ నిలిచారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన శ్రీనివాస్‌ రమేష్‌బాబు ఎన్నిక చెల్లదని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పౌరసత్వం పొందారని హైకోర్టును ఆశ్రయించారు.


2010 జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రమేష్‌బాబు పోటీ చేసిన సందర్భంలోనూ అది శ్రీనివాస్‌ ఎన్నికల కమిషన్‌ను అశ్రయించారు. అప్పుడు ఎన్నికల కమిషన్‌షెడ్యూల్‌ను నిలిపివేసింది. హైకోర్టును బీఆర్‌ఎస్‌ పార్టీ ఆశ్రయించగా అరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో ఎన్నికలు జరపాలని చెప్పింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఉప ఎన్నికల్లో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టడం చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి రమేష్‌బాబు పౌరసత్వంపై అది శ్రీనివాస్‌ పోరాటం చేస్తూనే వచ్చారు. 2013లో రమేష్‌బాబు పౌరసత్వాన్ని శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. రమేష్‌బాబు సుప్రీం కోర్టును అశ్రయించి స్టే పొందారు. 2014 ఎన్నికల్లో మరోసారి రమేష్‌బాబు గెలుపొందారు. కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టు ఆదేశాలతో 2017లో రమేష్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేసింది. హోంశాఖ హైకోర్టును సంప్రదించవచ్చని పేర్కొనడంతో మళ్లీ హైకోర్టుకు చేరుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

Minister Komati Reddy: బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదు.. కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ధ్వజం

Jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు

ABN Effect: గాంధీలో నీటి కటకటకు తెర

Sanjay: జీవన్ రెడ్డి అనుచురుడి హత్యపై ఎమ్మెల్యే సంజయ్ ఆరా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 22 , 2024 | 05:26 PM